Deepshikha Chandran: ఎవరీ దీప్శిఖా చంద్రన్? కన్నడ 'మార్క్'తో సెన్సేషన్... నెక్స్ట్ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ
Mark Movie Actress Deepshikha Chandran: దీప్శిఖా చంద్రన్... ఇప్పుడీ అమ్మాయి పేరు కన్నడనాట బలంగా వినబడుతోంది. 'మార్క్'లో ఆమె నటన, యాక్షన్ సీక్వెన్సులకు ప్రశంసలు వస్తున్నాయి. అసలు ఎవరీ అమ్మాయి?

స్టార్ హీరోల సినిమాల్లో, అందులో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లలో అందాల భామలకు స్టంట్ సీక్వెన్సులు, ఫైట్స్ చేసే అవకాశం రావడం చాలా అరుదు. అటువంటి ఓ అరుదైన అవకాశం యంగ్ హీరోయిన్ దీప్శిఖా చంద్రన్ (Deepshikha Chandran)కు వచ్చింది. కిచ్చా సుదీప్ 'మార్క్' సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న కర్ణాటకలో విడుదలైంది. అందులో దీప్శిఖా చంద్రన్ నటించారు. ఆమె నటనకు, యాక్షన్ సీక్వెన్సుకు ప్రశంసలు లభిస్తున్నాయి. అసలు ఎవరీ దీప్శిఖా చంద్రన్?
View this post on Instagram
మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అందాల భామ!
దీప్శిఖా చంద్రన్ సౌత్ ఇండియన్ అమ్మాయే. చెన్నైలో పెరిగింది. నటన, మోడలింగ్ మీద ఆసక్తి ఉండటంతో తొలుత మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. జీఆర్‌సీ జ్యువెలర్స్ యాడ్ చేశారు. ఆ వాణిజ్య ప్రకటనలో సీనియర్ తమిళ నటులతో పని చేశారు. అంతకు ముందు మరొక బిజినెస్ స్కూల్ యాడ్ కూడా చేశారు.
Also Read: ఎవరీ శివాజీ? టీవీ నుంచి సినిమాల్లోకి & రీ ఎంట్రీ... వివాదాలు కాదు, ఆయన విజయాలు తెల్సా?
View this post on Instagram
'మార్క్'కు ముందు విజయ్ ఆంటోనీ 'మార్గాన్'!
కన్నడ 'మార్క్' కంటే ముందు తమిళంలో సినిమా చేశారు దీప్శిఖా చంద్రన్. మన తెలుగు ప్రేక్షకులకూ తెలిసిన సంగీత దర్శకుడు - కథానాయకుడు విజయ్ ఆంటోనీ నటించిన 'మార్గాన్' గుర్తు ఉందా? ఆ సినిమాలో దీప్శిఖా చంద్రన్ ఓ రోల్ చేశారు. తెలుగులోనూ ఆ చిత్రాన్ని అనువదించారు. తెలుగు వెర్షన్ ప్రమోషనల్ కార్యక్రమాలకు వచ్చినప్పుడు చాలా వరకు తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించారు. త్వరలో తెలుగు తెరపై అడుగు పెట్టబోతున్నారు.
View this post on Instagram
స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసిందండోయ్!
Deepshikha Chandran Upcoming Movies Telugu: అవును... దీప్శిఖా చంద్రన్ ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశారు. 'బుట్టబొమ్మ'తో కథానాయకుడిగా పరిచయం అయిన సూర్య వశిష్ట ఉన్నారు కదా! 'దేవికా అండ్ డానీ' వెబ్ సిరీస్ చేశారు. అతని సరసన 'రమణీ కళ్యాణం' సినిమాలో కథానాయికగా నటించారు దీప్శిఖా చంద్రన్. ఆ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. 'మార్క్' తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ అయ్యింది. కన్నడలో సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీప్శిఖాకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. త్వరలో మరిన్ని సినిమాల్లో ఆవిడ కనిపించే అవకాశం ఉంది.
View this post on Instagram





















