అన్వేషించండి

Srikanth Iyangar : మరో వివాదంలో "పొట్టేల్'... రివ్యూయర్స్ పై బండబూతులతో విరుచుకుపడ్డ శ్రీకాంత్ అయ్యంగార్ 

'పొట్టేల్' మూవీ ఈవెంట్ లో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ రివ్యూయర్స్ పై బూతులతో విరుచుకుపడడం వివాదాస్పదంగా మారింది.

'పొట్టేల్' సినిమా రిలీజ్ కాకముందే వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే రిలీజ్ అయ్యాక ఈ సినిమా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది.. మూవీ ప్రమోషన్స్ లో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఏకంగా రివ్యూవర్స్ పై చెప్పలేని భాషలో అత్యంత దారుణంగా బండబూతులతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 

'పొట్టేల్' మూవీతో డైరెక్టర్ సాహిత్ టాలీవుడ్లో దర్శకుడిగా అడుగు పెట్టారు. అంతకంటే ముందే ఆయన ఒక షార్ట్ ఫిలిం తీసినప్పటికీ తన దర్శకత్వంలో వచ్చిన పెద్ద సినిమా మాత్రం ఇదే. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే కొంతమంది మాత్రం సినిమాకు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో పాటు సినిమాలోని మైనస్ పాయింట్స్ ని ఎత్తు చూపుతూ దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ కు ముఖం పట్టుకొని 'సినిమా 80లలో జరిగితే 90లో వచ్చిన 'శివ' సినిమాను ఎలా చూపించారు? పటేల్, పట్వారి వ్యవస్థ ఎప్పుడో అంతమైతే సినిమాలో చూపించారు ? ఇలా పద్ధతిగా సినిమా తీసినప్పుడు అలాంటి చిన్న చిన్న విషయాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కదా? ఇది లాజిక్ లెస్' అంటూ ప్రశ్నించారు. ఇక ఆయన చేసేదేం లేక తను కావాలనే అలా పెట్టానని ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగానే, ఇదే ప్రమోషనల్ ఈవెంట్లో తాజాగా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ రివ్యయర్స్ పై తిట్ల పురాణం అందుకున్నారు. 

ఈ కల్చర్ పోవాలి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పుకొచ్చారు. ఆన్ స్టేజ్ అలా రివ్యూస్ ఇచ్చిన వారిని ఇలా చెప్పలేని భాషలో శ్రీకాంత్ అయ్యంగార్ తిట్టడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త వివాదానికి దారి తీసింది. దీంతో సినిమా క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఆయనపై 'మా' అసోసియేషన్ కు కంప్లయింట్ చేశారు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. ఎక్కువగా రాంగోపాల్ వర్మ సినిమాలలో కనిపించి బాగా పాపులర్ అయిన ఆయన తాజాగా 'పొట్టేల్' సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాపై సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్స్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి సినిమాపై రివ్యూస్ నెగిటివ్ గా ఇచ్చిన వారిని తాజాగా శ్రీకాంత్ అయ్యంగార్ కడిగి పారేశారు.

కాగా మూవీ రిలీజ్ కు ముందు జరిగిన ఈవెంట్ లో హీరోయిన్ అనన్య నాగళ్ళకు కమిట్మెంట్ పై ఎదురైన ప్రశ్నలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ఈ విధంగా ప్రశ్నలు అడిగి తన సినిమా రిలీజ్ అవుతుందన్న సంతోషం లేకుండా చేశారు అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది అనన్య నాగళ్ల. కాగా ఆ వివాదంపై సదరు జర్నలిస్ట్ పై చర్యలు తీసుకోవాలి అంటూ ఫిల్మ్ ఛాంబర్ జర్నలిస్ట్ సంఘానికి లేఖ రాసింది. ఇప్పుడు మరోసారి శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన కామెంట్స్ 'పొట్టేల్' మూవీ వార్తల్లో నిలిచింది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget