Hitler Trailer: ఒకడి వెనక 40 మంది నిలబడితే గ్యాంగ్ స్టర్, 4 కోట్ల మంది నిలబడితే వాడే నాయకుడు
Hitler Movie Trailer | తమిళ హీరో విజయ్ ఆంటోని హీరోగా నటించిన హిట్లర్ అనే మూవీ ట్రైలర్ తాజాగా తెలుగులో రిలీజ్ అయ్యింది. మరి ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
Vijay Antonys Hitler movie | బిచ్చగాడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో విజయ్ ఆంటోని. ఇప్పుడు విజయ్ ఆంటోనీ 'హిట్లర్' అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ లో ఉన్న విశేషాలు ఏంటో ఒక లుక్కేద్దాం పదండి.
నిజమైన బలం డబ్బు అధికారం కాదు
కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ, రియా సుమన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం హిట్లర్. ధన దర్శకత్వంలో డిటి రాజా, డిఆర్ సంజయ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతోపాటు మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. వివేక్ - మార్విన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా, ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లఓ ఒక నియంతలా వ్యవహరించే పాలకుడిని ఎదుర్కొనే సాధారణ పౌరుడిగా నటించాడు విజయ్ ఆంటోనీ. యాక్షన్ థ్రిల్లర్ కథగా రూపొందిన ఈ సినిమాలో విజయ్ కిల్లర్ గా కనిపించబోతున్నాడు. పైగా ఇందులో విజయ్ ఆంటోనీ లుక్స్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉన్నాయి.
ఇక ట్రైలర్ విశేషాల విషయానికి వస్తే ట్రైలర్ మొదట్లోనే ఒక ఆయుధం సృష్టించబడిందంటే దాని లక్ష్యం ముందే నిర్ణయించబడి ఉంటుంది, ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు అధికారంలో కాదు ఒక మనిషిని నమ్మి వాడు వెనక ఉండే ఈ జనమే అంటూ చెప్పిన పవర్ ఫుల్ డైలాగులు, ట్రైలర్ లో కనిపించిన యాక్షన్స్ సన్నివేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోలీస్ అధికారిగా కనిపించారు. సినిమాలో లవ్ స్టోరీ తో పాటు ఇంటెన్స్ యాక్షన్ డ్రామా, కామెడీ కూడా ఉండబోతున్నాయని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ చివర్లో "ప్రజలు మనం చేసిన తప్పుల్ని గుర్తు గుర్తుచేసుకొని ఉంటే ఎన్నికల్లో మనం ఐదు సార్లు ఎలా గెలిచే వాళ్ళం" అంటూ విలన్ ప్రశ్నించిన విధానం ఆలోచింపజేస్తోంది.
విక్రమ్ సినిమాకు కాపీనా ?
సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న హిట్లర్ మూవీ ప్రమోషన్స్ ను తాజాగా ట్రైలర్ తో మొదలెట్టారు చిత్ర బృందం. కానీ ఆ ట్రైలర్ ని చూశాక గతంలో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సమురాయ్ అనే యాక్షన్ డ్రామా గుర్తొచ్చింది. ఈ రెండు సినిమాలలో తమ ప్రియురాలు చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికి అవినీతి వ్యవస్థతో హీరో పోరాటం చేయడం అనేది కామన్ పాయింట్ గా కనిపిస్తోంది. అంతేకాదు ఇప్పుడు హిట్లర్ ట్రైలర్ ను చూశాక స్టోరీ అవుట్ డేటెడ్ అనే టాక్ మొదలైంది. మరి ట్రైలర్ తోనే కాపీ అనే కామెంట్స్ విన్పించేలా చేసిన ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో మేకర్స్ రిలీజ్ చేస్తే ఎలా వర్కౌట్ అవుతుందో !?