Janhvi Kapoor: ధోనితో కలిసి సినిమా చూడాలనుంది, మనసులో మాట బయటపెట్టిన జాన్వీ కపూర్
హీరోయిన్ జాన్వీ కపూర్ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ ప్రమోషనల్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టింది. ధోనితో కలిసి ఈ సినిమా చూసేందుకు సాయం చేయాలని మీడియాను కోరింది.
Actress Janhvi Kapoor About Dhoni: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, హీరో రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’. స్పోర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ మూవీకి సంబంధించిన 'దేఖా తేను' పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న జాన్వీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ధోని మా సినిమా చూసేలా సాయం చేయండి- జాన్వీ కపూర్
దర్శకుడు శరణ్ శర్మ టీమిండియా మాజీ కెప్టెప్ ఎంఎస్ ధోనిపై అభిమానంతో ఈ సినిమాను తీశారని జాన్వీ కపూర్ వెల్లడించింది. ఈ మూవీ టీమ్ తో కలిసి ధోని సినిమా చూస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. ధోని ఫిలాసఫీ ప్రకారమే ఈ సినిమా ఉంటుందన్నారు. ధోని ప్రవర్తన చాలా ఇంప్రెసివ్ గా ఉంటుందని చెప్పింది. “క్రికెటర్ ధోని ఫిలాసఫీ ప్రకారమే ఈ సినిమా ఉంటుంది. మా చిత్ర బృందంతో కలిసి ఆయన సినిమా చూస్తూ బాగుంటుందని భావిస్తున్నాను. ధోని మా రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తాడని భావిస్తున్నాం. కానీ, ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. కానీ, మాకోసం ఆయన టైమ్ స్పెండ్ చేస్తాడని అనుకుంటున్నాను. ఇటీవల నేను ఓ కార్యక్రమంలో అతడిని కలిశాను. ఆయన ప్రవర్తన చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ధోని తన అభిమానులను ఎంతో గౌరవంగా చూస్తారు. చక్కగా మాట్లాడుతారు. సెల్ఫీలు కూడా ఇస్తారు. ఆయన వ్యహార శైలి చాలా నచ్చింది. ధోని, ఆయన సతీమణి సాక్షి ఎలాగైనా తమ సినిమా చూసేలా మీడియా సాయం చేయాలి” అని కోరింది.
మే 31న ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ విడుదల
‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ సినిమాను జీ స్టూడియోస్‍తో కలిసి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమాలో రాజ్‍కుమార్ రావ్, జాన్వీతో పాటు రాజేశ్ శర్మ, కుముద్ మిశ్రా, అభిషేక్ బెనర్జీ కీలకపాత్రలు చేశారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది.
వరుస సినిమాలతో జాన్వీ బిజీ బిజీ
జాన్వీ కపూర్ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' మూవీతో పాటు 'ఉలజ్' చిత్రంలోనూ నటిస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’లోనూ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె తంగం అనే పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అటు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనూ జాన్వీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.
Read Also: పెళ్లయిన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలిసింది - నాపై యాసిడ్ పోస్తానని బెదిరించారు..