Kalki 2898 AD: మరో మూడు రోజుల్లో 'కల్కి' ట్రైలర్ - మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన టీం, వారియర్‌గా కనిపించిన బిగ్‌బి
Amitabh Bachchan New Look: మరో మూడు రోజుల్లో కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ టీం మరో కొత్త పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేసింది. ఇందులో బిగ్‌బి వారియర్‌గా పవర్ఫుల్‌గా కనిపించారు.
Vyjayanthi Movies Release Amitabh Bachchan New Look: ప్రస్తుతం అంతా 'కల్కి 2898 AD' మేనియా కొనసాగుతుంది. యావత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు టాక్. సైన్స్ ఫిక్షన్‌గా వస్తున్న ఈ సినిమాపై ప్రచార పోస్టర్స్, ఫస్ట్‌లుక్, నటీనటుల వివరాలు అన్ని కూడా క్యూరియాసిటీ పెంచుతున్నారు.
ఈ క్రమంలో కల్కి మూవీ నుంచి వస్తున్న ఎలాంటి అప్‌డేట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్‌గా థియేటర్లోకి రాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్‌ను ముహుర్తం ఫిక్స్ చేశారు. జూన్ 10న కల్కి ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక కొంతకాలంగా అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్, కల్కి ఆడియన్స్‌కి ఇది పండగలా లాంటి వార్త. దీంతో ట్రైలర్ కోసం ఈగర్ వెయిట్ చేస్తున్నామంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటీ పెంచుతూ తాజాగా మేకర్స్ తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అశ్వద్ధామాగా ఆయన కనిపించబోతున్నారు. ఇప్పటికే అభితాబ్ లుక్‌ని పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్‌ను ఇంకా మూడు రోజులే ఉంటూ అమితాబ్ బచ్చన్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అమితాబ్ లుక్ పవర్ఫుల్‌గా ఉంది. ఆయన యుద్ధంలో పోరాడినా యోధుడిగా కనిపించారు. ఆయన వెనకాల యుద్దానికి సంబంధించిన వాహనం, మనుషులు కింద పడి ఉన్నారు. ఈ పోస్టర్‌లో అమితాబ్ బచ్చన్ ఒక చేతిలో ఆయుధం, మరో చేతి పెద్ద కర్ర పట్టుకుని కనిపించారు. ఈ పోస్టర్ ప్రస్తుతం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
ఇక ఆయన బ్యాగ్రౌండ్‌లో వాహనం మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ "ట్రైలర్‌కి ఇంకా మూడు రోజులే ఉంది" అంటూ వైజయంతీ మూవీస్ క్యాప్షన్ ఇచ్చింది. కాగా వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ. 500 నుంచి రూ.600 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే విశ్వనటుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పటాని వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు అతిథి పాత్రలో సీనియర్ నటి శోభన, 'రౌడీ' హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్‌లు కనిపించనున్నారని ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.