అన్వేషించండి

Varalakshmi Sarathkumar: వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లికి ఆహ్వానం - కుటుంబ సమేతంగా రజనీకాంత్‌ ఇంటికి వెళ్లిన శరత్‌ కుమార్‌, ఫోటోలు వైరల్‌

Varalakshmi Sarathkumar Meets Rajinikanth: నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ని కలిసింది. కుటుంబంతో కలిసి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి తలైవాను పెళ్లికి ఆహ్వానించింది.

Varalaxmi Sarathkumar meets Rajinikanth: నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి పనులు షురూ అయ్యాయి. వరలక్ష్మి శరత్‌ త్వరలోనే పెళ్లీ పీటలు ఎక్కబోతోన్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు నికోలయ్‌‌ సచ్‌దేవ్‌తో ఏడడుగులు వేయబోతున్నారు. జూలై 2న వీరి పెళ్లికి ముహుర్తం ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పెళ్లి తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అందరికి ఆహ్వానాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖుల ఇంటికి స్వయంగా వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శరత్‌ కుమార్‌ కుటుంబ సమేతంగా సూపర్‌ స్టార్‌, తలైవా రజనీకాంత్‌ ఇంటికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా దిగిన ఫోటోలను వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. "మన తలైవర్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ సర్‌ని లతా ఆంటీని కలిసి నా పెళ్లికి ఆహ్వానించాను. మీరు ఎల్లప్పుడు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞురాలిని సర్‌. ఎప్పటిలాగే ఐశ్వర్య ఎంతో ప్రేమగా మాట్లాడావు" అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా వరలక్ష్మితో పాటు ఆమె తండ్రి శరత్‌ కుమార్‌, ఆయన సతీమణి, నటి రాధిక శరత్‌ కుమార్, ఆమె కూతురు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కాగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఇటీవల తన ప్రియుడు నికోలయ్‌ సచ్‌దేవ్‌ని సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండ సడెన్‌గా ఆమె ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో అంతా షాక్‌ అయ్యారు. నికోలయ్‌ సచ్‌దేవ్‌ తన చిన్ననాటి స్నేహితుడని, కొంతకాలంగా ప్రేమించుకున్న వారు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మార్చి 1న కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి జూలై 2న థాయ్‌లాండ్‌ జరగనుందని సమాచారం. అయితే నికోలయ్‌ సచ్‌దేవ్‌కు ఇదివరకే పెళ్లయ్యింది. గతంలో కవిత అనే ఓ మోడల్‌ని పెళ్లి చేసుకున్న అతడికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. నికోలయ్ సచ్‌దేవ్ కూతురు కష సచ్‌దేవ్ పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ వైడ్‌ పతకాలు కూడా సాధించింది. అయితే కొన్నేళ్ల క్రితమే నికొలయ్-కవితకు డైవోర్స్‌ అయ్యాయట. ఆమె విడాకులు తీసుకుని విడిపోయిన అనంతరం వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో  పడి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. 

వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే

ప్రస్తుతం లేడీ విలన్‌గా సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసింది.నటుడు శరత్‌ కుమార్‌ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె 'పొడా పొడి' సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. అలా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన ఆమె సహానటి పాత్రలు కూడా చేసింది. ఈ క్రమంలో సినిమాలకు కొంత గ్యాప్‌ తీసుకున్న ఆమె తెనాలి రామకృష్ణ ఎల్‌ఎల్‌బీ సినిమాతో తెలుగులో లేడీ విలన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'జాంబి రెడ్డి', 'నాంది', 'యశోద', 'వీరసింహా రెడ్డి' వంటి సినిమాల్లో విలన్‌ నటించిన తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది. రీసెంట్‌గా బ్లాక్‌బస్టర్‌ మూవీ హనుమాన్‌లో అక్క పాత్రలో కనిపించి ఆకట్టుకుంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget