అన్వేషించండి

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ డేట్ ఫిక్స్ - వరుణ్ తేజ్, నితిన్ లతో పోటీ పడనున్న విశ్వక్ సేన్!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా సినిమాకి తన మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నాడు. రీసెంట్ గా 'దమ్కి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమాతో ఒక ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కేవలం 10 సినిమాల కెరియర్ లోనే తన గ్రాఫ్ ని అమాంతం పెంచుకుంటూ వస్తున్న విశ్వక్ సేన్ మరోసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కి జోడిగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. విశ్వక్ సేన్ కెరీర్ లోని భారీ బడ్జెట్ మూవీగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' వస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ని అందజేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్లో విశ్వక్ సేన్ మరోసారి తన మాస్ లుక్ తో ఆకట్టుకోగా డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

నిజానికి ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయినప్పుడు సినిమాని డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దాని ప్రకారం ఈ మూవీని క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయానికి ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ రిలీజ్ కాబోతోంది. దాంతో చిత్ర బృందం డిసెంబర్ మొదటి వారంలో రావాలని ఫిక్స్ అవుతూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సరిగ్గా అదే రోజు నితిన్ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్', వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లోనూ ఇండస్ట్రీలోనూ మంచి అంచనాలే ఉన్నాయి.

నితిన్ మొదటిసారి రచయిత, దర్శకుడు అయిన వక్కంతం వంశీతో చేస్తున్న సినిమా కావడంతో 'ఎక్స్ ట్రా ఆర్డినరీ' మూవీపై మంచి హైప్ నెలకొంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన నితిన్ లుక్, డేంజర్ పిల్లా సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అటు వరుణ్ తేజ్ నటిస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్' కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తో తెరకెక్కింది. ఈ మూవీతో వరుణ్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు రీసెంట్ గా ఈ మూవీకి భారీగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్టు తెలుస్తోంది.

డిసెంబర్ 8 బరిలో ఇప్పటికే వరుణ్ తేజ్, నితిన్ ఉండగా ఇప్పుడు వీళ్లకు పోటీగా విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తో వస్తున్నాడు. సో వరుణ్, నితిన్, విశ్వక్ సేన్ ల మధ్య డిసెంబర్ 8న త్రిముఖ పోటీ ఉండబోతోందన్నమాట. మరోవైపు మూడు సినిమాలు ఒకే రోజున విడుదల ఉండడంతో కచ్చితంగా థియేటర్స్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీరిలో ఏ హీరో అయినా వెనక్కి తగ్గుతారా? లేక అదే రోజున తమ సినిమాలని రిలీజ్ చేస్తారా? అనేది చూడాలి.

Also Read : కొడుకు లిప్ లాక్ సీన్‌పై రాజీవ్ కనకాల కామెంట్ - పక్కకి లాక్కెళ్ళిపోయిన సుమ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget