మొన్న విజయ్, నిన్న విశ్వక్ సేన్ - స్టేజ్ మీదే చీర పైట తీసి ఆట, నేహా శెట్టి డ్యాన్స్ వైరల్!
విశ్వక్ సేన్ తన కొత్త సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ నేహా శెట్టి తో కలిసి రొమాంటిక్ డాన్స్ చేశారు. స్టేజ్ మీదే పబ్లిక్ గా హీరోయిన్ చీర లాగుతూ డాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తమ సినిమాలను ప్రమోట్ చేసేందుకు ఈ తరం హీరో, హీరోయిన్లు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. సినిమాని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియాలో తమ సినిమానే హాట్ టాపిక్ అవ్వాలని ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అందుకు నిదర్శనంగా ఇప్పటికే చాలా సంఘటనలు జరిగాయి. అయితే తాజాగా చూసుకుంటే టాలీవుడ్ లో ఉన్న ఓ ఇద్దరి యంగ్ హీరోలు తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు స్టేజ్ పైనే హీరోయిన్ తో కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేసి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. వాళ్లు మరెవరో కాదు ఒకరేమో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అయితే మరొకరేమో మాస్ కా దాస్ విశ్వక్ సేన్. 'ఖుషి' మ్యూజికల్ ఈవెంట్ లో సమంతతో కలిసి విజయ్ దేవరకొండ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతుంటే దానికి మించి ఇప్పుడు విశ్వక్ సేన్ పబ్లిక్ గా హీరోయిన్ చీర లాగి ఆమెతో రొమాంటిక్ డాన్స్ చేశాడు. విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బోల్డ్ బ్యూటీ, DJ టిల్లు హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో కూడా తన అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తూ బోల్డ్ గానే నటించినట్లు కనిపిస్తోంది ఈ హీరోయిన్. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన 'సుట్టంలా సూసి' అనే సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఈ పాటలో గోదావరి అందాలలో విశ్వక్ సేన్, నేహా శెట్టి ఓ రేంజ్ లో రొమాన్స్ తో రెచ్చిపోయారు.
అయితే తాజాగా ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా అందరి ముందే నేహా శెట్టి చీరలాగుతూ డాన్స్ చేశాడు విశ్వక్ సేన్. పాటలో ఉన్న డాన్స్ స్టెప్స్ ని స్టేజ్ పైనే మరోసారి రీ క్రియేట్ చేస్తూ ఈ జంట చేసినా రొమాంటిక్ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాంగ్ బీట్ మొదలు కాగానే నేహా శెట్టి తన చీర కొంగుతో విశ్వక్ సేన్ ని చుట్టేసింది. ఇక విశ్వక్ కూడా నేహా శెట్టి చీర కొంగుని తన నోటితో లాగుతూ ఇద్దరూ కలిసి రొమాంటిక్ గా డాన్స్ చేయడం అక్కడున్న వాళ్ళందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా నేహా శెట్టి తన చీర కొంగు మొత్తాన్ని తీసేసి స్టేజ్ పైనే పబ్లిక్ గా డాన్స్ చేయడంతో ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ అంతా షాక్ కి గురవుతున్నారు. దీంతో ఈ జనరేషన్ హీరో, హీరోయిన్లు పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారంటూ పలువురు నైటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు దీనికంటే ముందు జరిగిన 'ఖుషి' మ్యూజికల్ ఈవెంట్లో ఇలాంటి సీన్ ఒకటి జరిగింది. స్టేజ్ పైకి వచ్చిన విజయ్ దేవరకొండ షర్టు తీసేసి సమంతతో డాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇలా స్టేజ్ పైనే తమ కెమిస్ట్రీతో ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నారంటే ఇంక సినిమాలో ఈ జంటలు మరింత రెచ్చిపోయి ఉంటారని అంటున్నారు సినీ జనాలు. మొత్తానికి ఇలాంటి స్టంట్స్ తో వేదికలపై పబ్లిసిటీ పెంచుకునే సరికొత్త ట్రెండ్ ని టాలీవుడ్ యంగ్ హీరోలు మొదలెట్టడం గమనార్హంగా మారింది. మరి ముందు ముందు ఇంకెంత మంది హీరోలు ఈ ట్రెండ్ ని ఫాలో అవుతారో చూడాలి.
Also Read : అలాంటి ట్రాప్‌లో పడొద్దని చరణ్ అన్న నాతో చెప్పారు: వరుణ్ తేజ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial