Gangs Of Godavari: విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి క్రేజీ అప్డేట్, విడుదల తేదీని అనౌన్స్ చేసిన టీమ్
విశ్వక్ సేన్ ఇప్పటికే ఈ ఏడాదిలో ‘దాస్ కా ధమ్‌కీ’ చిత్రంతో వచ్చి క్లీన్ హిట్‌ను అందుకున్నాడు. ఇక ఈ ఏడాదిలోనే తన మరో చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు.
యంగ్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు.. యూత్ అంతా మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజుల్లో చాలావరకు యంగ్ హీరోల సినిమాలు మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా నిలుస్తున్నాయి. పైగా దానికి వారు చేస్తున్న ప్రమోషన్స్ కూడా యూత్ ఆడియన్స్‌కు వారిని దగ్గర చేస్తున్నాయి. అలాంటి యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఇప్పటికే తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్‌తో చాలామందిని తన ఫ్యాన్స్‌ను చేసుకున్న విశ్వక్.. తన అప్‌కమింగ్ మూవీ విడుదల తేదీని ప్రకటించాడు. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌ను మూవీ టీమ్ తాజాగా బయటపెట్టింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఎక్కువగా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈసారి కమర్షియాలిటీతో పాటు మాస్‌ను కూడా యాడ్ చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టైటిల్ మాత్రమే కాదు.. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కూడా ఇది గోదావరి జిల్లాల్లో జరిగే కథ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మూవీలో విశ్వక్ సేన్‌కు జోడీగా నేహా శెట్టి నటిస్తుండగా.. అంజలి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి పెద్దగా అప్డేట్స్ లేవు కానీ.. ఒక పాట మాత్రం విడుదలయ్యింది. ఆ పాటతోనే అందరినీ ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌ను బయటపెట్టాడు.
ఏడాదిలో రెండో సినిమా..
2023 డిసెంబర్ 8న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ థియేటర్లలో విడుదల కానుందని విశ్వక్ సేన్ ప్రకటించాడు. ఇప్పటికే ఈ ఏడాది ‘దాస్ కా ధమ్‌కీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్.. ఈ ఏడాదిలోనే రెండో మూవీకి కూడా ప్లాన్ చేయడం విశేషం. ఇక ఈ ఏడాది మొదట్లో విడుదలయిన ‘ధమ్‌కీ’ చిత్రం పరవాలేదనిపించుకుంది. ఈ మూవీ కోసం మరోసారి దర్శకుడిగా మైక్రోఫోన్ పట్టుకున్నాడు విశ్వక్. ఇప్పుడు దర్శక బాధ్యతలు కొన్నిరోజలు పక్కన పెట్టి పూర్తిగా హీరోగా తన ఫోకస్ అంతా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పైనే పెట్టాడు. అందుకే ‘సుట్టంలా సూసి’ అంటూ ఈ మూవీ నుంచి విడుదలయిన మొదటి పాట కోసం విశ్వక్ సేన్, నేహా శెట్టి రంగంలోకి దిగి ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.
ఇద్దరితో మొదటిసారి..
విశ్వక్ సేన్ మాత్రమే కాదు.. నేహా శెట్టి కూడా యూత్‌కు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. ఇప్పటికే ‘డీజే టిల్లు’లో రాధికగా ఆకట్టుకున్న నేహా కమ్ బ్యాక్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మధ్యలో పలు సినిమాల్లో నటించినా కూడా రాధికలాంటి పాత్ర కోసం మళ్లీ తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి విడుదలయిన మొదటి పాటలో చీరకట్టులో మరోసారి తన ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చింది నేహా. ఈ మూవీలో నేహా శెట్టితో పాటు నాజర్, సాయికుమార్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్.. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం నేహా శెట్టితో మాత్రమే కాదు అంజలితో కూడా మొదటిసారి జతకడుతున్నాడు విశ్వక్ సేన్.
Also Read: విజువల్స్ లేకుండానే ‘UI’ మూవీ టీజర్ - చీకటి, శబ్దాలతోనే ఉపేంద్ర మ్యాజిక్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial