FUNKY Release Date: వేసవిలో కాదు... లవర్స్ డేకి విశ్వక్ సేన్ 'ఫంకీ' - లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Vishwak Sen's FUNKY Release Date: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా సితార, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న 'ఫంకీ' సినిమా వేసవిలో కాకుండా లవర్స్ డేకి రానుంది. రిలీజ్ డేట్ మారింది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'ఫంకీ' (Funky Movie). 'జాతి రత్నాలు'తో ప్రేక్షకులను నవ్వించిన, హాస్యభరిత చిత్రాలకు చిరునామాగా మారిన కేవీ అనుదీప్ (KV Anudeep) ఈ చిత్రానికి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రిలీజ్ డేట్ మారింది.
వేసవిలో కాదు... ప్రేమికుల రోజుకు ముందు!
Funky Release Date Changed: మొదట ఏప్రిల్ 2026లో 'ఫంకీ'ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు విడుదల తేదీ మారింది. సినిమాను ముందుకు తీసుకు వచ్చారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా లవర్స్ డే కంటే ఒక రోజు ముందుగా థియేటర్లలోకి 'ఫంకీ' సందడి మొదలు కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
View this post on Instagram
దర్శకుడిగా విశ్వక్ సేన్... కయాదు రోల్?
సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో 'ఫంకీ' రూపొందుతోంది. ఇందులో దర్శకుడిగా విశ్వక్ సేన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ఆయన నటన, ఎనర్జీ, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విశ్వక్ సేన్ జంటగా 'డ్రాగన్' ఫేమ్ కయాదు లోహర్ నటిస్తున్నారు. నిర్మాత కుమార్తెగా ఆమె కనిపించనున్నారు.
'ఫంకీ'కి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్, వీటీవీ గణేష్, రఘు బాబు, సంపత్ రాజ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: సురేష్ సారంగం, రచన: అనుదీప్ - మోహన్, కళా దర్శకుడు: జానీ షేక్.





















