Vshwwak Sen: అందుకే నా ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేశా - అసలు విషయం చెప్పిన విశ్వక్ సేన్
Vishwak Sen on Instagram: విశ్వక్ సేన్ తన ఇన్‌స్టాగ్రామ డిలీట్ చేయడంపై వివరణ ఇచ్చాడు. మెకానిక్ రాకీ ఈవెంట్‌లో ఏ నటి వల్ల ఇన్‌స్టాను డియాక్టివ్ చేశారని రిపోర్టర్ అడగ్గా అసలు విషయం వెల్లడించాడు.
Vishwak Sen Clarifies on His Instagram Deleted: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. తరచూ తన కామెంట్స్, తీరుతో వివాదాల్లో నిలుస్తుంటాడు ఈ యంగ్ హీరో. అంతేకాదు ఎప్పుడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఒక్కోసారి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటాడు. ఒక్కోసారి కొన్ని రోజుల వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ విషయం సస్పెన్స్‌లోనే ఉంది. దీనికి కారణం ఏంటనేది ఇప్పటికీ క్లారిటీ లేదు.
తాజాగా తన 'మెకానిక్ రాకీ' మూవీ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో ఈ విషయమై స్పందించాడు విశ్వక్ సేన్. గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా 'మెకానిక్ రాకీ' టీం మీడియాతో ఇంటారాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్‌కు తన ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేయడంపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఓ విలేఖరి ఏ నటి కారణంగా మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు? ఎందుకని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం లేదు? అని ప్రశ్నించారు. దీనిపై విశ్వక్ కాస్తా అసహనం వ్యక్తం చేస్తూ తన అకౌంట్ డియాక్టివేట్ చేయడానికి ఏ నటి కారణం కాదని స్పష్టం చేశాడు.
అనంతరం మాట్లాడుతూ.. "నువ్వు అమ్మాయిల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటావేమో.. నేను అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఉంటాను. అంతా ఏవేవో విషయాల కోసం సోషల్ మీడియాలో ఉంటారు కావచ్చు. నేను మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటానికి ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తాను. అయినా ఎవరో నటి గురించి నేనెందుకు ఇన్‌స్టాగ్రామ్‌ను డీయాక్టివేట్ చేస్తాననుకున్నారు. నేను నా పనిపై మరింత శ్రద్దగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేశా. మార్చి 29తో నాకు 30 ఏళ్లు నిండాయి. ఈ విషయం నాకు అప్పుడే అర్థమైంది. 30 ఏళ్లు వచ్చినా అదీ, ఇదీ అని ఫోన్‌లో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఇన్‌స్టాగ్రామ్‌ను డియాక్టివేట్ చేశాను. మీరు ఎప్పుడైనా గమనిచారో లేదో. నేను సినిమా రిలీజ్‌కు వారం ముందు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటా.. మళ్లీ సినిమా రిలీజైన వారం తర్వాత వెళ్లిపోతా. అయినా యాక్టర్ కోసం నేను ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేశానని ఎలా అనిపించింది మీకూ" అంటూ వివరణ ఇచ్చాడు విశ్వక్.
ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో ఓ వివాదం అనంతరం తన అకౌంట్‌ని డిలీట్ చేసినట్టు అప్పుట్లో అభిప్రాయాలు వచ్చాయి. ప్రభాస్-నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ ప్రీమియర్స్ తర్వాత ఓ యూట్యూబర్ మూవీ బాగా లేదంటూ నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. అది చూసిన విశ్వక్ సేన్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే నెగిటివ్ రివ్యూలు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. దీనికి ఉద్దేశిస్తూ ఇన్‌స్టాలో ఇలా పోస్ట్ పెట్టాడు. ఇండస్ట్రీ అంటే వేలాది కుటుంబాలు. ఎన్నో కుటుంబాలను ఈ పరిశ్రమపైనే ఆధారపడి బ్రతుకుతున్నారని, అలాంటి గొప్ప పరిశ్రమ అంటే యూట్యూబర్లకు సరదా అయిపోయిందంటూ మండిపడ్డాడు. సినిమాలపై అభిప్రాయలు చెప్పేవారు ఏదైనా షార్ట్ ఫిలిం తీసి చూపించాలంటూ అసహనం వ్యక్తం చేశాడు. అప్పట్లో ఈ అంశంలో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో సడెన్ విశ్వక్ తన ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
Also Read: ఈ దేశాన్ని పీడుస్తుంది దరిద్రం కాదు సార్.. నల్లధనం - ఆసక్తి పెంచుతున్న 'మిస్టర్ బచ్చన్' టీజర్