అన్వేషించండి

Laila: 'ప్లీజ్.. పైరసీని ప్రోత్సహించొద్దు' - కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ ప్రేక్షకులకు లైలా టీం రిక్వెస్ట్

Laila Team Request: టాలీవుడ్ పరిశ్రమను పైరసీ భూతం వేధిస్తుండగా తాజా 'లైలా' చిత్ర బృందం అప్రమత్తమైంది. పైరసీని ప్రోత్సహించొద్దని ప్రేక్షకులకు సూచించింది. పైరసీ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరింది.

'Laila' Movie Team Request To Audience About Piracy: మాస్ కా దాస్ విశ్వక్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా' (Laila) శుక్రవారం (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల పైరసీ భూతం మళ్లీ విజృంభిస్తోన్న క్రమంలో మూవీ టీం అలర్ట్ అయ్యింది. 'లైలా' పైరసీని ప్రోత్సహించొద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఎక్కడైనా 'లైలా' పైరసీ కనిపిస్తే @blockxtechs సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా గానీ report@blockxtech.com మెయిల్ ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని సూచించింది. ఎవరైనా పైరసీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సినిమాను థియేటర్లలోనే చూసి ఎంజాయ్ చేయాలని పేర్కొంది.

కాగా, టాలీవుడ్ పరిశ్రమకు  ప్రస్తుతం పైరసీ సవాల్‌గా మారింది. టెక్నాలజీ పెరిగేకొద్దీ అంతకంతకూ విస్తరిస్తూ.. ముఖ్యంగా తెలుగు సినిమాలు పైరసీ బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇటీవల, రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer), నాగచైతన్య 'తండేల్' (Thandel) సినిమాలు పైరసీకి గురయ్యాయి. ఏకంగా ఆర్టీసీ బస్సుల్లోనే 'తండేల్' సినిమా ప్రదర్శించడం షాక్‌కు గురి చేసింది. దీనిపై దర్శక నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తండేల్' పైరసీ చేసినా.. మువీ డౌన్ లోడ్ చేసి చూసిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా 'తండేల్' పైరసీ చేస్తే 9573225069 కు మెసేజ్ చేయాలని సూచించారు.

Also Read: 'ఛావా' ఫస్ట్ రివ్యూ - నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్‌లో భారీ హిట్టు కొట్టిందా?

'లైలా'ను చుట్టుముట్టిన వివాదాలు

మాస్ కా దాస్ హీరోగా విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా రామ్ నారాయణ్ దర్శకత్వంలో 'లైలా' సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్‌లో విభిన్న పాత్రలో నటించారు. సినిమాను సాహు గారపాటి నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. అయితే, విడుదలకు ముందే 'లైలా' సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇటీవలే సోషల్ మీడియా వేదికగా 'బాయ్ కాట్ లైలా'ను ట్రెండ్ చేశారు. అంతే కాకుండా విడుదల రోజే సినిమా పైరసీ లింక్స్ పోస్ట్ చేస్తామంటూ తమకు బెదిరింపులు వచ్చాయని హీరో విశ్వక్ చెప్పారు. 

సారీ చెప్పిన 30 ఇయర్స్ పృథ్వీరాజ్

'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన నటుడు పృథ్వీరాజ్.. 'మేకల సత్యం అనే క్యారెక్టర్ సీన్ షూట్ చేసేటప్పుడు యాదృచ్ఛికంగా ఒకటి జరిగింది. మొదట 150 మేకలు ఉన్నాయని చెప్పారు. చివరికి ఎన్ని ఉన్నాయని లెక్కిస్తే సరిగ్గా 11 ఉన్నాయి.' అని పేర్కొనగా.. పరోక్షంగా తమ పార్టీని టార్గెట్ చేశారంటూ వైసీపీ శ్రేణులు ఫైర్ అయ్యాయి. సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్ చేశాయి. దీనిపై హీరో విశ్వక్, నిర్మాత సాహు గారపాటి వివరణ ఇచ్చారు. అది తమ నోటీస్‌లో జరగలేదని.. సినిమాను సినిమాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా, నటుడు పృథ్వీరాజ్ సైతం సోషల్ మీడియా వేదికగా సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

'సినిమాను కిల్ చెయ్యుద్దు. సినిమాను ప్రేమిద్దాం. గౌరవిద్దాం. నా వల్ల ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాను. ఎవరివైనా మనోభావాలు దెబ్బతినుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకండి. లైలాను బాయ్ కాట్ చేయకండి. విశ్వక్‌సేన్‌కు ఫలక్‌నుమాదాస్‌కు మించిన విజయం ఈ సినిమా అందిస్తుందని ఆశిస్తున్నా.' అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

Also Read: ఫుల్ సక్సెస్ జోష్‌లో 'కోబలి' టీం - ఫ్యాక్షన్ డ్రాప్ రివేంజ్ డ్రామా పార్ట్ 2 కూడా ఉంది, అంతకు మించేనా!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget