Karthik Varma Dandu Engagement: పెళ్ళికి సిద్ధమైన 'విరూపాక్ష' దర్శకుడు... నిశ్చితార్థానికి హాజరైన చైతూ - శోభిత, సాయి దుర్గా తేజ్
Karthik Varma Dandu - Harshitha: దర్శకుడు కార్తీక్ వర్మ దండు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన ఎంగేజ్మెంట్ జరిగింది. ఇంతకీ, వధువు ఎవరంటే?

దర్శకుడు కార్తీక్ వర్మ దండు (Director Karthik Varma Dandu) పెళ్లికి మొదటి అడుగు పడింది. ఆయన ఇంట పెళ్లి సందడి మొదలు అయ్యింది. త్వరలో ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆదివారం హైదరాబాద్ సిటీలో ఎంగేజ్మెంట్ మొదలైంది.
హర్షితతో కార్తీక్ వర్మ దండు పెళ్లి!
హర్షితతో కార్తీక్ వర్మ దండు ఏడు అడుగులు వేయనున్నారు. బంధు మిత్రులు, కుటుంబ సభ్యులు, సినిమా ప్రముఖుల సమక్షంలో ఆదివారం హైదరాబాద్‌లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
Also Read: మళ్ళీ మెగా పవర్ స్టారే... గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసిన రామ్ చరణ్!
త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న కార్తీక్ వర్మ దండు...
— ABP Desam (@ABPDesam) September 28, 2025
ఆదివారం హర్షితతో హైదరాబాద్‌లో జరిగిన ఎంగేజ్మెంట్!#KarthikVarmaDandu #Harshitha#Virupaksha #NC24 #NagaChaitanya #SobhitaDhulipala #SaiDurghaTej #SDT pic.twitter.com/088V5n9djh
నిశ్చితార్థంలో ప్రత్యేక ఆకర్షణగా హీరోలు!
కార్తీక్ వర్మ దండు - హర్షిత నిశ్చితార్థానికి నాగ చైతన్య - శోభిత ధూళిపాళ దంపతులతో పాటు సుప్రీమ్ స్టార్ సాయి దుర్గా తేజ్ హాజరు అయ్యారు. ఆ వేడుకలో హీరోలు ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
View this post on Instagram
నవదీప్, నవీన్ చంద్ర నటించిన 'భం బోలేనాథ్'తో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత కొంత విరామం తీసుకున్నారు. భారీ బ్లాక్ బస్టర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.
సాయి దుర్గా తేజ్, సంయుక్త హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'విరూపాక్ష'. అటు విమర్శకులను, ఇటు ప్రేక్షకులను ఆ సినిమా మెప్పించింది. బాక్స్ ఆఫీస్ బరిలో వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ సినిమాకు దర్శకుడు కార్తీక్ వర్మ దండు. 'విరూపాక్ష' విజయం తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా మిస్టిక్ థ్రిల్లర్ తెరకెక్కించే అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ మీద ఉంది.





















