By: ABP Desam | Updated at : 22 Feb 2023 09:59 AM (IST)
సాయి ధరమ్ తేజ్, సముద్రఖని, పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఓ సినిమా చేయనున్నారు. ఈ సంగతి తెలిసిందే. దీనికి ప్రముఖ నటుడు, గతంలో తెలుగులో రవితేజ 'శంభో శివ శంభో'కు దర్శకత్వం వహించిన సముద్రఖని దర్శకుడు. ఈ విషయం కూడా తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ఈ కబురు కూడా ప్రేక్షకులు తెలుసు. మరి, కొత్త కబురు ఏంటి? అంటే...
షూటింగ్ మొదలైంది
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభించినట్టు నిర్మాణ సంస్థలు తెలిపాయి. మామా అల్లుళ్ళు ఇద్దరూ బ్లాక్ కలర్ హుడీస్ వేసుకుని ఫస్ట్ డే షూటింగుకు రావడం, చేయడం విశేషం.
Also Read : ఇంటికి పంపాలనుకున్నా వెళ్ళను, పవర్ స్టార్ స్థాయికి ఎదుగుతా, మీకెందుకు తొందర? - కిరణ్ అబ్బవరం
సముద్రఖని ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తమిళ హిట్ 'వినోదయ సీతమ్'కి ఈ సినిమా రీమేక్. ఈ చిత్రానికి తొలుత సాయి మాధవ్ బుర్రాను మాటల రచయితగా తీసుకున్నారు. అయితే, తాను వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు మాటలు రాయలేనని ఆయన తప్పుకొన్నారట. దాంతో ఇప్పుడు ఆ బాధ్యత కూడా త్రివిక్రమ్ మీద పడింది. ముందు నుంచి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని తెలుగుకు కావాల్సిన మార్పులు, చేర్పులు చేశారట. ఒక వైపు మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాతో పాటు ఈ సినిమా డైలాగ్ వర్క్ చేస్తున్నారట.
కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకు ముందు 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కొంత సేపే ఉంటుంది. షూటింగ్ చేయడానికి ఎక్కువ రోజులు అవసరం లేదు. అందుకని, ముందు ఈ సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 డేస్ కేటాయించారట. మార్చి నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ చేస్తారని సమాచారం.
Also Read : చిరంజీవి రేసులో ఇద్దరు దర్శకులు - ఛాన్స్ ఎవరికో?
'వినోదయ సీతమ్' తెలుగు వెర్షన్ విషయానికి వస్తే... ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ నటించనున్నారు. ఈ ఏడాదే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
'వినోదయ సీతం' రీమేక్ కాకుండా... 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ సినిమా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. ఈ ఏడాది ఆయన నుంచి రెండు సినిమాలు రావచ్చని వినబడుతుంది. షూటింగ్ స్పీడ్ బట్టి రిలీజులు డిసైడ్ అవుతాయి.
Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్
Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ
NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్
Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన
Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం