అన్వేషించండి
Vikram Prabhu Interview: అల్లు అర్జున్ కంటే ముందు ఆ రోల్ చేయమని నన్ను అడిగారు - అనుష్క 'ఘాటీ' హీరో విక్రమ్ ప్రభు ఇంటర్వ్యూ
Vikram Prabhu On Ghaati: 'ఘాటీ'తో తమిళ్ లెజెండరీ హీరో శివాజీ గణేషన్ మనవడు, ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సినిమా విడుదల సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ...

అనుష్క 'ఘాటీ', తెలుగు హీరోలపై విక్రమ్ ప్రభు మనసులో మాట... ఆసక్తికర విషయాలు!
Source : ABPLIVE AI
Vikram Prabhu First Telugu Interview: 'ఘాటీ'తో తమిళ కథానాయకుడు విక్రమ్ ప్రభు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఇంతకు ముందు పలకరించిన ఆయనకు తొలి స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. సెప్టెంబర్ 5న సినిమా విడుదల కానున్న సందర్భంలో... తెలుగులో తనకు ఇష్టమైన హీరోలు, ఇంతకు ముందు మిస్ అయిన తెలుగు సినిమాలు, అనుష్క 'ఘాటీ'లో నటించడం గురించి విక్రమ్ ప్రభు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు...
- తెలుగు సినిమా చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఇప్పటికి కుదిరింది. నా జీవితంలో ఏదీ ప్లానింగ్ ప్రకారం జరగలేదు. నేను దర్శకుడు అవ్వాలని అనుకున్నాను. కానీ హీరో అయ్యాను. మనసు చెప్పింది చేసుకుంటూ వెళ్లడం నాకు అలవాటు. అనుష్కతో ఇంతకు ముందు నటించే అవకాశం ఒకసారి వచ్చింది. 'రుద్రమదేవి' సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రను దర్శకుడు గుణశేఖర్ మొదట నాకే చెప్పారు. అప్పుడు చేయడం కుదరలేదు. అల్లు అర్జున్ గారు ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశారు. ఇప్పుడు మరోసారి అనుష్కతో నటించే అవకాశం రావడంతో మిస్ చేసుకోలేదు.
- అనుష్కతో సినిమా చేసే అవకాశం రావడం సంతోషం. అయితే ఈ 'ఘాటీ'కి ఓకే చెప్పడానికి మొదట కారణం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఆయన కథను వివరించిన తీరు బాగా నచ్చింది. నేను ఎగ్జైట్ అయ్యా. పైగా క్రిష్ చాలా పాజిటివ్ పర్సన్. అనుభవం ఉన్న దర్శకుడు. చిత్రీకరణకు ముందు 'ఘాటీ' అనే ప్రపంచం ఎలా ఉంటుందో చూపించారు. దేశి రాజు పాత్రకు నన్ను ఎందుకు ఎంపిక చేశారో కూడా వివరంగా చెప్పారు. నన్ను దృష్టిలో పెట్టుకుని రాసిన పాత్ర కావడంతో వెంటనే ఓకే చెప్పాను.
- అనుష్క గారితో నటించడం మంచి అనుభవం. నేను ఆవిడ ఫ్యాన్. పేరుకు తగ్గట్టు అనుష్క గారు నిజంగా స్వీట్ పర్సన్. కళ్ళతో అన్ని హావభావాలు పలికించగలరు. సంగీత దర్శకుడు సాగర్, మా డీవోపీ, టెక్నికల్ టీం అంతా కలిసి వెండితెరపై కొత్త ప్రపంచం ఆవిష్కరించారు. 'ఘాటీ' ప్రపంచం ప్రేక్షకులంతా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
Also Read: అత్తమ్మ పాడె మోసిన చిరంజీవి... అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియల్లో మెగా ఎమోషనల్ మూమెంట్
- మెగాస్టార్ చిరంజీవి గారు, అక్కినేని నాగార్జున గారు తెలుగులో నాకు ఇష్టమైన హీరోలు నేను వాళ్లకు అభిమానిని. వాళ్ళిద్దరి సినిమాలు ఎన్నోసార్లు థియేటర్లలో చూశా. ఇప్పుడు తెలుగులో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది.
- మా నాన్నగారు ప్రభు తెలుగు సినిమాలు చేశారు. ఆయనతో కలిసి నేను ఎప్పుడు సినిమా చేస్తానని చాలామంది అడుగుతారు. నాన్నతో కలిసి నటించాలని నాకు ఉంటుంది. అయితే అవసరం లేకుండా ఏదో ఇరికించినట్లు ఆ సినిమాలో మా ఇద్దరి పాత్రలు ఉండకూడదని ప్రాముఖ్యం ఉంటేనే చేయాలని అనుకున్నాం. మా ఇద్దరికీ సరిపడా కథ వస్తే కలిసి నటించడానికి మేం రెడీ.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement





















