అన్వేషించండి

'లియో' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు - తెలుగులో ఎన్ని కోట్లో తెలుసా?

తమిళ అగ్ర హీరో విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న 'లియో' మూవీ దసరా కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.

కోలీవుడ్ లో ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న 'లియో'(Leo) కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్ తదుపరి చిత్రంగా వస్తున్న 'లియో'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో తలపతి విజయ్, త్రిష హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూసి కచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అవుతుందని, అంతేకాకుండా 'విక్రమ్' మూవీ కలెక్షన్స్ ని బీట్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ లో 'లియో' సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్నట్లు సమాచారం. ఒక్క తమిళ్ వెర్షన్ లోనే 'లియో' సినిమాకి దాదాపు రూ.200 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 'లియో' ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు చూసుకుంటే.. 

తమిళ నాడు - రూ.100కోట్లు

కేరళ - రూ.16కోట్లు

కర్ణాటక - రూ.15కోట్లు

తెలంగాణ + ఆంధ్ర - రూ.22కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.65కోట్లు

ఓవర్సీస్ - రూ.65కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ థియేట్రికల్ బిజినెస్ - రూ.228 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

'లియో' తెలుగు రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ ఏకంగా రూ.22 కోట్లకు కొనుగోలు చేయడం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు ఓ డబ్బింగ్ సినిమాకి ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. మరోవైపు విజయ్, త్రిష సుమారు 15 సంవత్సరాల తర్వాత 'లియో'తో బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. చివరగా ఈ జంట 2008లో 'కురువి' మూవీలో నటించారు. అలాగే 'మాస్టర్' తర్వాత లోకేష్ కనగరాజ్ విజయ్ తో చేస్తున్న రెండవ సినిమా ఇది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ మీనన్జ్ మన్సూర్ అలీ ఖాన్ వంటి ప్రధాన తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న లియో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాతో పాటు దసరా బరిలో బాలయ్య 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు ఇప్పటికే రేసులో ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు దీటుగా తలపతి విజయ్ 'లియో' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. తమిళం తో పాటు తెలుగులోనూ 'లియో' ప్రమోషన్స్ ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో విజయ్ ప్రమోషన్స్ కోసం తెలుగు రాష్ట్రాలకు వస్తాడా లేదా అనేది చూడాలి. గతంలో 'తుపాకి' రిలీజ్ టైం లో ప్రమోషన్స్ కి హైదరాబాద్ వచ్చిన విజయ్ ఆ తర్వాత మరే సినిమాకు రాలేదు. విజయ్ కనుక తెలుగు రాష్ట్రాలకు వచ్చి ప్రమోట్ చేస్తే 'లియో' కి మరింత క్రేజ్ దక్కే అవకాశం ఉంది.

Also Read : రక్తాన్ని చూసి భయపడుతున్న త్రిష - 'లియో' నుంచి మరో పోస్టర్ రిలీజ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget