News
News
వీడియోలు ఆటలు
X

Kushi Release Date : సెప్టెంబర్‌లో 'ఖుషి' ఖుషీగా - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది. సెప్టెంబర్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు నేడు వెల్లడించారు. అది ఎప్పుడంటే?

FOLLOW US: 
Share:

సెన్సేషనల్ హీరో, రౌడీ బాడీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత రూత్ ప్రభు (Samantha) జంటగా చిత్రం 'ఖుషి'. శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది.

సెప్టెంబర్ 1న 'ఖుషి'
Kushi Release Date : సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. 

'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో విజయ్ దేవరకొండకు నార్త్ ఇండియన్ ఆడియన్స్‌లో గుర్తింపు లభించింది. 'డియర్ కామ్రేడ్'ను దక్షిణాది భాషల్లో విడుదల చేశారు. 'లైగర్' అయితే పాన్ ఇండియా రిలీజ్ అయ్యింది. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు సమంత పరిచయం అయ్యారు. అందులో నటనకు మంచి పేరు తెచ్చుకున్నారు. 'యశోద' పాన్ ఇండియా సక్సెస్ సాధించింది. వీళ్ళిద్దరూ నటిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి క్రేజ్ నెలకొంది.

Also Read : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల 
     
View this post on Instagram
 
A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

జోరుగా, హుషారుగా షూటింగ్!
సమంత మయోసైటిస్ బారిన పడటంతో ఈ సినిమా చిత్రీకరణకు కొన్ని రోజులు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున 'ఖుషి' చిత్ర బృందంతో సమంత జాయిన్ అయ్యారు. ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం తెరకెక్కుతున్న 'సిటాడెల్' వెబ్ సిరీస్ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ వచ్చారు.  

ప్రస్తుతం 'ఖుషి' షూటింగ్ భాగ్య నగరంలో జరుగుతోంది. ఇటీవల దుర్గం చెరువు సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హీరో హీరోయిన్స్ విజయ్ దేవరకొండ, సమంత మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. కశ్మీర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు విజయ్ దేవరకొండను కశ్మీర్ కుర్రాడిగా, సమంతను తమిళ్ అమ్మాయిగా చూపించారు. 

'ఖుషి'లో పీటర్ హెయిన్ ఫైట్స్!
Peter Hein for Kushi : 'ఖుషి' ప్రేమ కథ అని తెలిసిందే. అయితే, ఈ ప్రేమ కథలో ఫైట్స్ కూడా ఉన్నాయ్! ఫేమస్ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఆ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్, యువ సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన్ను హీరో విజయ్ దేవరకొండ కలిశారు. సినిమాలో సాంగ్స్ ఎలా ఉండాలనేది డిస్కస్ చేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు అయ్యాయని చిత్ర బృందం తెలిపింది.

Also Read : హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు - క్లాప్ కొట్టిన రాఘవేంద్రుడు

ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి. 

Published at : 23 Mar 2023 03:36 PM (IST) Tags: Vijay Deverakonda Samantha Kushi Movie Update Kushi On Sep 1st Kushi Release Date

సంబంధిత కథనాలు

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

టాప్ స్టోరీస్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో  కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు