VD13 Movie Update : విజయ్ దేవరకొండను అమెరికా తీసుకు వెళుతున్న 'దిల్' రాజు, పరశురామ్!
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి అంతా రెడీ చేశారు.
రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా రూపొందుతోంది. ఆ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కలయికలో వస్తున్న చిత్రమిది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ లొకేషన్స్ రెక్కీ కూడా పూర్తి అయ్యింది.
అమెరికాలో VD13 Movie షూటింగ్!
కథానాయకుడిగా విజయ్ దేవరకొండకు 13వ చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 54వ సినిమా. దీనికి 'ఫ్యామిలీ స్టార్' (VD 13 titled as Family Star) టైటిల్ ఖరారు చేశారట. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టాక్. ఈ సినిమా కోసం 'దిల్' రాజు, దర్శకుడు పరశురామ్, చిత్ర బృందంలో కీలక సభ్యలు అమెరికా వెళ్లారు. అగ్ర రాజ్యంలో లొకేషన్స్ రెక్కీ చేశారు. ఆ వేట పూర్తి అయ్యింది. త్వరలో చిత్రీకరణ చేయడానికి రెడీ అవుతున్నామని నిర్మాణ సంస్థ వెల్లడించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 'ఖుషి' చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య రాజమండ్రిలో చిత్రీకరణ ముగించుకున్న హీరో హైదరాబాద్ చేరుకున్నారు.
విజయ్ సరసన 'సీతా రామం' భామ మృణాల్!
విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను కథానాయిక ఎంపిక చేశారు. 'సీతా రామం'లో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత నాని సినిమాలో అవకాశం అందుకున్నారు. తెలుగులో ఆమెకు ఇది మూడో సినిమా. విజయ్ దేవరకొండతో, 'దిల్' రాజు నిర్మాణంలో మొదటి సినిమా.
Also Read : తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టే కొడుకు వైఎస్ జగన్ - అదే 'యాత్ర 2'
View this post on Instagram
దర్శకుడు పరశురామ్ తీసిన చివరి మూడు సినిమాలు చూస్తే... హీరో ఒరిజినల్ పేరును సినిమాలో క్యారెక్టర్ పేరుగా ఫిక్స్ చేశారు. 'సర్కారు వారి పాట'లో మహేష్ బాబు పేరు మహి అలియాస్ మహేష్. 'గీత గోవిందం'లో విజయ్ గోవింద్ పాత్రలో విజయ్ దేవరకొండను చూపించారు. 'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్ పేరు శిరి అలియాస్ శిరీష్. 'ఫ్యామిలీ స్టార్'కు వస్తే విజయ్ దేవరకొండను కుటుంబ రావుగా చూపించబోతున్నారని టాక్. సంక్రాంతికి 'ఫ్యామిలీ స్టార్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత 'దిల్' రాజు ప్లాన్ చేస్తున్నారట.
Also Read : ఊరిలోకి వస్తే చంపేస్తారా? పేగులతో వీణ చేసి వీధి వీధినా మీటుతూ...
'ఫ్యామిలీ స్టార్'కు ముందు మరో రెండు!
Vijay Devarakonda Next Movie : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళుతుందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది. 'ఫ్యామిలీ స్టార్' కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి', గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమా విజయ్ దేవరకొండ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, 'దిల్' రాజు సినిమాకు తొలుత దర్శకుడిగా చాలా మంది పేర్లు వినిపించాయి. మోహన కృష్ణ ఇంద్రగంటి నుంచి గౌతమ్ తిన్ననూరి వరకు కొందరి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. చివరకు, పరశురామ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశారు. 14 రీల్స్, గీతా ఆర్ట్స్ సంస్థలో చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టి మరీ పరశురామ్ ఈ సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial