News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vijay Devarakonda : పెళ్లి కబురు చెబుతానంటున్న విజయ్ దేవరకొండ - రష్మిక చేతిలో చెయ్యి వేసి మరీ?

'జీవితంలో చాలా జరుగుతోంది. త్వరలో ప్రకటిస్తా' అంటూ సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ చేశారు. అందులో రెండు చేతులు ఉన్నాయి. రష్మికతో పెళ్లి విషయాన్ని త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. 

FOLLOW US: 
Share:

'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పెళ్లికి రెడీ అవుతున్నారా? త్వరలో తన ప్రేయసిని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారా? తాను ప్రేమలో ఉన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారా? అంటే... 'అవును' అని చెప్పాలి. 

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మంగళవారం సాయంత్రం విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ చేశారు. అందులో రెండు చేతులు ఉన్నాయి. ఓ చెయ్యి ఆయనది అని ఎవరైనా ఈజీగా ఊహించవచ్చు. మరో చెయ్యి ఎవరిదీ? అనేది కొంచెం పక్కన పెట్టి... ఆ ఫోటోకి విజయ్ దేవరకొండ ఇచ్చిన కాప్షన్ చూస్తే? ''జీవితంలో చాలా జరుగుతున్నాయి. అయితే, ఇది మాత్రం చాలా స్పెషల్! త్వరలో అనౌన్స్ చేస్తా'' అని పేర్కొన్నారు. దాంతో ఆయన ప్రేమ, పెళ్లికి సంబంధించిన కబురు చెప్పబోతున్నారని ప్రేక్షకులతో పాటు చిత్రసీమ ప్రముఖులు కూడా ఊహిస్తున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా తెలుగు చిత్రసీమ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట. విజయ్ దేవరకొండ లేటెస్ట్ పోస్టుతో అందులో ఉన్న మరో చెయ్యి రష్మికది అని చాలా మంది భావిస్తున్నారు. రష్మికతో ప్రేమ విషయాన్ని చెబుతారని ఆశిస్తున్నారు. 

Also Read టార్గెట్ పాన్ ఇండియా - సెప్టెంబర్‌ బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలే టాప్!

రెండు సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు. అందులో మొదటి సినిమా 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్. రెండో సినిమా 'డియర్ కామ్రేడ్'కు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. మంచి పేరు అయితే వచ్చింది. అన్నిటి కంటే మించి ఆ రెండు సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చలన చిత్ర పరిశ్రమలో సైతం వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని బలమైన ప్రచారం జరుగుతోంది. అయితే... తాము ప్రేమలో ఉన్న సంగతిని విజయ్ దేవరకొండ గానీ, రష్మిక గానీ ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. అందుకని, ఈ హీరో చేసిన లేటెస్ట్ పోస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 

త్వరలో పెళ్లి చేసుకుంటా... విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఖుషి'. ప్రేమ పెళ్లి, పెళ్లి తర్వాత ఆలుమగల మధ్య కలహాలు, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పెళ్లి ప్రశ్న విజయ్ దేవరకొండకు ఎదురైంది. అప్పుడు ఆయన ''త్వరలో పెళ్లి చేసుకుంటా'' అని చెప్పారు. రాబోయే రెండు మూడు ఏళ్లలో ఏడు అడుగులు వేస్తానని తెలిపారు.

Also Read ప్రతి పండక్కి... ప్రతి నెలలో శ్రీ లీల సినిమా - వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు!

విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి రష్మిక చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఆ మధ్య ఆనంద్ దేవరకొండ 'బేబీ' సాంగ్ విడుదల కార్యక్రమానికి రష్మిక వచ్చారు. అప్పుడు దేవరకొండ అభిమానులు ఆమెను 'వదిన... వదిన' అంటూ పిలవడం, దానికి రష్మిక ముసిముసి నవ్వుల్లో మునిగిపోవడం ప్రేక్షకులంతా గమనించారు. ఇక, విజయ్ & రష్మిక ఫారిన్ టూర్లు కూడా డిస్కషన్ పాయింట్ అయ్యాయి. తామిద్దరం కలిసి వెళ్ళినప్పుడు ఎప్పుడూ వాళ్ళు చెప్పలేదు. కానీ, ఎయిర్ పోర్టుల్లో ఒకేసారి కనిపించడం, మాల్దీవుల్లో సేమ్ రిస్టార్టుల్లో ఫోటోలు దిగి పోస్ట్ చేయడం ప్రేక్షకులు గమనించారు. రష్మిక తమ కుటుంబ సభ్యురాలు అని ఆనంద్ దేవరకొండ కూడా ఇంటర్వ్యూల్లో చెప్పారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 29 Aug 2023 06:48 PM (IST) Tags: Rashmika Mandanna Vijay Devarakonda Vijay Devarakonda Rashmika Marriage Vijay Devarakonda Marriage Vijay Devarakonda Love Vijay Rashmika Love

ఇవి కూడా చూడండి

‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?

Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?

CBFC corruption row: విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం - విచారణకు ఆదేశం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వెల్లడి

CBFC corruption row: విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం - విచారణకు ఆదేశం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వెల్లడి

Ganapath Teaser: టైగర్‌ ష్రాఫ్ ‘గణపథ్‌‘ టీజర్ చూశారా? యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ రావాల్సిందే!

Ganapath Teaser: టైగర్‌ ష్రాఫ్ ‘గణపథ్‌‘ టీజర్ చూశారా? యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ రావాల్సిందే!

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్