Liger Movie Controversy : వివాదంలో 'లైగర్' సాంగ్, విజయ్ దేవరకొండ సినిమాను బాయ్‌కాట్ చేస్తే పరిస్థితి ఏంటి?
విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ ఉత్తరాదిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే... ఆయన సినిమాపై కొంత మంది నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
సౌత్ ఇండియా నుంచి వస్తున్న సినిమాలను నార్త్ ఇండియా ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. 'బాహుబలి' నుంచి మొదలు పెడితే... 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం', 'కెజియఫ్', తాజాగా విడుదలైన 'కార్తికేయ 2' వరకు, ప్రతి సినిమా నార్త్ ఇండియాలో మంచి వసూళ్లు సాధిస్తోంది. వచ్చే వారం టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో రూపొందిన 'లైగర్' (Liger Movie) సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాపై మాత్రం నార్త్ ఇండియన్ ఆడియన్స్ మండి పడుతున్నారు.
'లైగర్'పై ఎందుకంత వ్యతిరేకత?
'లైగర్' సినిమాపై నార్త్ ఇండియన్ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత రావడానికి రెండు కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకటి... కరణ్ జోహార్. హిందీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు, సినిమా ఇండస్ట్రీకి చెందిన పిల్లల వారసుల్ని ఎంకరేజ్ చేస్తున్నారని ఉత్తరాది ప్రేక్షకులు ఆయన సినిమాలను బాయ్‌కాట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. 'లైగర్' నిర్మాతల్లో కరణ్ జోహార్ ఒకరు కావడంతో ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌కాట్ చేయమని ట్విట్టర్ సాక్షిగా పిలుపు ఇస్తున్నారు. మరొక కారణం... అనన్యా పాండే. చుంకీ పాండే కుమార్తెగా ఆవిడ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆమెకు కరణ్ జోహార్ ఆశీసులు ఉన్నాయి. ఆమెపై కోపం కూడా సినిమా మీదకు మళ్లిందని చెప్పవచ్చు.
కొత్త వివాదం... చిక్కుల్లో 'లైగర్' సాంగ్!
ఇప్పుడు కొత్తగా మరో వివాదం మొదలైంది. సినిమాలో 'ఆ... ఫట్', 'అకిడి పకిడి...' పాటలపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. 'ఆ... ఫట్' పాటలో హిందీ లిరిక్స్ వివాదానికి కారణం అయ్యాయి. హిందీలో 70లలో వచ్చిన ఒక సినిమాలోని రేప్ సన్నివేశంలో డైలాగులను ఫన్నీగా ఉపయోగించారని ఒకరు ట్వీట్ చేశారు. మరి కొంత మంది కూడా లిరిక్స్ మీద విమర్శలు చేస్తున్నారు.
#Liger songs lyrics
— Neha Khullar (@Npunjabibyheart) August 18, 2022
#Aafat uses 70's rape sequence dialogue in fun way and #AkdiPakdi using child's vocals for singing F ( F..K) word..
I am the only one who found this problematic
సాంగ్ కంటే కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ కావడంతో 'బాయ్‌కాట్ లైగర్' (Boycott Liger) అనేది ఎక్కువ ట్రెండ్ అవుతోంది. ఈ వ్యతిరేకతను విజయ్ దేవరకొండ ఎలా డీల్ చేస్తారో చూడాలి.
Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - ఆ బూతు డైలాగ్స్ కట్!
Hear me loud,no matter how much you are going to promote this #Liger there’s always going to be someone like me to realise how Bollywood is trying to ask help from Tollywood to wash their deeds! I therefore #BoycottBollywood along with #BoycottLiger
— Van|sha mus|ng w|th SSR (@TILIGETITRIGHT) August 9, 2022
SSR Opened Imp Conversations pic.twitter.com/vhW0Ugf3gF
విమర్శలతో పాటు విజయ్ దేవరకొండకు అదే స్థాయిలో ఆదరణ లభిస్తోంది. హిందీ హీరోలు, హీరోయిన్లతో పాటు సాధారణ ప్రేక్షకులలో కూడా ఆయనకు అభిమానులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ప్రశంసలు... లేదంటే విమర్శలు... ఏదో ఒక రూపంలో సినిమా వార్తల్లో నిలుస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యాయి. అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'అర్జున్ రెడ్డి'ని షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసినా... ఒరిజినల్ వెర్షన్ కూడా చూసిన నార్త్ ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ విజయ్ దేవరకొండ స్ట్రెయిట్ హిందీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - సినిమాలో పాటలు ఎన్ని? ఫైట్లు ఎన్ని?