Liger Trailer Update: విజయ్ దేవరకొండ మాస్ - యాక్షన్ - ఎంటర్‌టైన్‌మెంట్, 'లైగర్' ట్రైలర్ రిలీజ్ ఆ రోజే
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'లైగర్' సినిమా ట్రైలర్ విడుదల తేదీని ఈ రోజు వెల్లడించారు.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'లైగర్'. సాలా క్రాస్ బ్రీడ్... అనేది ఉప శీర్షిక. ఆల్రెడీ టీజర్, 'అకిడి పకిడి...' సాంగ్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ రెడ్ రోజెస్ పోస్టర్ అయితే సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. త్వరలో ట్రైలర్ విడుదల చేయనున్నారు.
జూలై 21న... అనగా గురువారం 'లైగర్' ట్రైలర్ (Liger Trailer)ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు ఈ రోజు వెల్లడించారు. 'జూలై 21న మాస్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్... 'లైగర్' ట్రైలర్'' అని చిత్ర బృందం వెల్లడించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం... ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల కానుంది.
Also Read : అరెరే, విజయ్ దేవరకొండ 'లైగర్' క్లైమాక్స్ ట్విస్ట్ లీక్ అయ్యిందే
విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read : మెగా 154 సెట్స్‌లో రవితేజ, వెల్కమ్ చెప్పిన చిరంజీవి - మెగా మాస్ కాంబో షురూ
View this post on Instagram