News
News
వీడియోలు ఆటలు
X

సస్పెన్స్ క్రియేట్ చేస్తోన్న'బిచ్చగాడు 2'లోని 'డుముకి చల్' వీడియో సాంగ్

హీరో విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'బిచ్చగాడు 2' సినిమాలోని డుముకి చల్ అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తోన్న గీతా మాధురి పాడిన ఈ పాట.. వైరల్ గా మారింది.

FOLLOW US: 
Share:

Bichagadu 2 : హీరో విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం 'బిచ్చగాడు 2'. 'బిచ్చగాడు' మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న ఈ మూవీలోని 'డుముకి చల్' అనే వీడియో సాంగ్ కు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. సింగర్ గీతా మాధురి పాడిన ఈ పాటకు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో కావ్య చాపర్ ఎక్స్ ప్రెషన్స్ ముఖ్యంగా యూత్ ను అత్యంత ఆకర్షిస్తున్నాయి. ఇక ఆమె ఈ సాంగ్ కు చేసిన స్టెప్స్, డ్యాన్స్ ఉర్రూతలూగిస్తోంది. మెయిన్ గా సాంగ్ లోని 'డుముకి డుముకి చల్ చటక్ మటక్ లటక్ చల్' అనే పదాలు.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఓ వైపు సాంగ్ నడుస్తుండగానే.. మధ్య మధ్యలో వచ్చే విజయ్ ఆంటోనీ సన్నివేశాలు.. సినిమాకు క్లైమాక్స్ లా అనిపించేవిలా ఉన్నాయి. మొత్తంగా అత్యంత ఇంట్రస్టింగ్ గా, సస్పెన్స్ గా ఉన్నఈ వీడియో సాంగ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

2016లో రిలీజైన 'బిచ్చగాడు పార్ట్ 1' కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో.. ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించని రీతిలో కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్ గా వస్తోన్న 'బిచ్చగాడు 2' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 14నే విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ తో పాటు రిలీజ్ పైనా అప్ డేట్ ఇచ్చిన మేకర్స్.. బిచ్చగాడు 2ను మే 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయనుండడం చెప్పుకోదగిన విషయం.

'బిచ్చగాడు 2' సీక్వెల్‌ను పలు సూపర్ హిట్లు అందించిన ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకున్నట్టు సమాచారం. దీంతో హీరో విజయ్ ఆంటోనీనే దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై ఆయనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

ఇక 'బిచ్చగాడు పార్ట్ 1'లో తన తల్లి ఆరోగ్యం కోసం వ్యాపారవేత్త అయిన విజయ్ ఆంటోనీ...  ఓ స్వామిజీ సలహాతో బిచ్చగాడుగా మారతాడు. 40 రోజుల పాటు దీక్ష చేసి తల్లి ప్రాణాలను కాపాడుకుంటాడు. కానీ 'బిచ్చగాడు 2' మాత్రం దీనికి విరుద్దంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. మరి గ్యాంగ్‌స్టర్.. బిచ్చగాడిగా ఎందుకు మారాడనేది ఈ సీక్వెల్ సారాంశమని ప్రచారం జరుగుతోంది.

Also Read : 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?

సంగీత స్వరకర్త, నేపధ్య గాయకుడు, నటుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్, చిత్ర నిర్మాత.. ఇలా సినీ ఇండస్ట్రీలో విజయ్ ఆంటోనీ.. అనేక బాధ్యతలు నిర్వర్తించారు. 2005 లో సంగీత దర్శకుడిగా చిత్రరంగంలో అరంగేట్రం చేసిన ఆయన.. ఉత్తమ సంగీత విభాగంలో "నాక ముక్క" అనే సినిమా ప్రకటనల పాట కోసం 2009 కేన్స్ గోల్డెన్ లయన్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా ప్రసిద్ది గాంచారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

Also Read : ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ విన్ అయినప్పుడు భర్తకు ఏడేళ్లు, టీవీలో ప్రోగ్రామ్ చూసిన నిక్

Published at : 12 May 2023 12:38 PM (IST) Tags: Singer Geetha Madhuri Vijay Antony Bichagadu 2 Song Release Bichagadu Sequel Dumuki Chal

సంబంధిత కథనాలు

వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!

వచ్చేస్తోంది తమన్నా కొత్త వెబ్ సీరిస్ - స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే!

రెహమాన్, వడివేలు పాట - కన్నీళ్లు పెట్టుకున్నకమల్ హాసన్!

రెహమాన్, వడివేలు పాట - కన్నీళ్లు పెట్టుకున్నకమల్ హాసన్!

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Ponniyin Selvan 2 on OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియన్ సెల్వన్ 2' - ఇక నుంచి ఫ్రీగా చూడొచ్చు!

Ponniyin Selvan 2 on OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియన్ సెల్వన్ 2' - ఇక నుంచి ఫ్రీగా చూడొచ్చు!

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! -  పోనీ డ్రా అయితే గద ఎవరికి?