By: ABP Desam | Updated at : 12 May 2023 12:11 PM (IST)
Photo Credit: Priyanka/Instagram
బాలీవుడ్ లో తనంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా, నెమ్మదిగా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాలు, వెబ్ సిరీస్ లో నటించి చక్కటి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ‘లవ్ ఎగైన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తన భర్త నిక్ జోనస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రీసెంట్ గా నటి, గాయకురాలు జెన్నిఫర్ హడ్సన్ షోలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మిస్ వరల్డ్ కిరీటాన్ని గెల్చుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 17 సంవత్సరాల వయస్సులో మిస్ వరల్డ్ విజేతగా నిలిచినట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో తన భర్త నిక్ జోనస్ 7 ఏండ్ల వయసులో ఉన్నట్లు తెలిపారు. ఈ మిస్ వరల్డ్ పోటీని ఆయన తన తండ్రితో కలిసి టీవీ చూసినట్లు చెప్పుకొచ్చారు. "మా అత్తగారు నాకు ఈ విషయాన్ని చెప్పారు. నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మిస్ వరల్డ్ విజేతగా నిలిచాను. ఈ పోటీ లండన్‌లో జరిగింది. అప్పుడు నిక్ ఆయన తండ్రితో కలిసి ఈ వేడుకలను టీవీలో చూసినట్లు మా అత్తగారు చెప్పారు. అప్పుడు వారు టెక్సాస్ లో నివాసం ఉన్నట్లు చెప్పారు” అని ప్రియాంక వివరించారు. "మా మామగారైన కెవిన్ సీనియర్‌కు అందాల పోటీలు చూడటం చాలా ఇష్టం. అతడు తన కొడుకుతో కలిసి నేను విజేతగా నిలిచిన మిస్ వరల్డ్ పోటీని చూశారు. నిక్ వచ్చి టీవీ ముందు కూర్చొని నేను గెలిచిన క్షణాన్ని చూసినట్లు మా అత్తగారు చెప్పారు" అని ప్రియాంక తెలిపారు. “ఈ సంఘటన జరిగి సుమారు 22 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు తన వయసు 7 సంవత్సరాలు. నాకు 17 సంవత్సరాలు. నిజానికి తాము పెళ్లి చేసుకుంటామని ఎవరూ ఊహించి ఉండరు. జీవితం అనేది ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పడం కష్టం” అని ప్రియాంక చెప్పుకొచ్చారు.
ప్రియాంక చోప్రా తాజాగా యాక్షన్-థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’లో కనిపించింది. విత్ రిచర్డ్ మాడెన్‌తో కలిసి ఇందులో అద్భుతంగా నటించింది. అమెజాన్ ప్రైమ్ ప్రతిష్టాత్మకంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించింది. రస్సో బ్రదర్స్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ప్రియాంక ‘లవ్ ఎగైన్’ అనే సినిమాలోనూ నటించింది. ఇవాళ(మే 12) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో తన భర్త నిక్ జోనాస్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.
Read Also: మహేష్ సినిమా టైటిల్ అదేనా? సెంటిమెంట్ కంటిన్యూ చేసిన త్రివిక్రమ్
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!
మాస్ లుక్‌లో మహేష్, ప్రభాస్‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం
ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !