Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. అలాంటి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కుతున్న చిత్రం ‘విధి’.
ఈరోజుల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రొటీన్ స్టోరీతో ఉన్న కమర్షియల్ సినిమాలను చూడడం తగ్గించేశారు. అందుకే చిన్న బడ్జెట్ సినిమాలు అయినా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించాలని చూస్తున్నారు మేకర్స్. అలాంటి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కిన చిత్రం ‘విధి’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. మూవీ టీమ్ అంతా ఈ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయడంతో పాటు మూవీ విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సినిమా ద్వారా మళ్లీ చాలాకాలం తర్వాత తెలుగమ్మాయి ఆనంది టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది.
రోహిత్ నందా, ఆనంది జంటగా నటిస్తోన్న చిత్రమే ‘విధి’. నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీదుగా రంజిత్. ఎస్ ఈ మూవీని నిర్మించారు. శ్రీనాథ్ రంగనాథన్ కేవలం ఈ సినిమాకు రచన చేయడం మాత్రమే కాకుండా కెమెరామెన్ బాధ్యతను కూడా స్వీకరించాడు. దర్శకుడిగా శ్రీకాంత్ వ్యవహరించాడు. ఎన్నో యూత్‌ఫుల్ సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల.. విధికి కూడా సంగీతాన్ని అందించడానికి సిద్ధమవుతున్నాడు. దర్శక నిర్మాతలతో ఇతర మూవీ టీమ్ అంతా కూడా ‘విధి’ గురించి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
కంటిచూపు లేనివారు ఎంజాయ్ చేయగలిగే సినిమా..
ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో ‘విధి’ చిత్రం తెరకెక్కిందని హీరో రోహిత్ నందా బయటపెట్టాడు. కంటి చూపు లేని వాళ్లు కూడా ఈ సినిమా అనుభూతి చెందగలరని అన్నాడు. అలాంటి వారికోసం ప్రత్యేకంగా ఈ సినిమాను వేసి చూపించబోతున్నామని చెప్పాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పది లక్షల మంది కంటి చూపు లేని వాళ్లున్నారని, అందులో 90 శాతం మంది థియేటర్‌కు వెళ్లి ఉండకపోవచ్చని, వాళ్లంతా థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను ఆస్వాధించవచ్చని తెలిపాడు. మీడియా నుండి సినిమాల్లోకి వచ్చిన శ్రీనాథ్.. తమ సినిమాకు మీడియా సపోర్ట్ ఉండాలని కోరాడు. ఇక ‘విధి’ తమ మొదటి సినిమా అని, ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ లవర్ లాంటిది అని దర్శకుడు ఫన్నీగా పోల్చాడు. రైటింగ్ టైమ్‌లో తనకు రైటర్‌కు గొడవలు జరిగాయని, సెట్‌కు వచ్చిన తర్వాత అంతా మామూలు అయిపోయేవని గుర్తుచేసుకున్నాడు.
రెండో సినిమా..
‘శ్రీదేవి సోడా సెంటర్’ తర్వాత ఆనంది మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇన్నాళ్ల తర్వాత ‘విధి’తో వస్తోంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమయినందుకు సంతోషంగా ఉందని చెప్పింది. రోహిత్‌తో చాలా ఏళ్ల క్రితమే నటించాల్సి ఉందని, కానీ అప్పుడు మిస్ అయిందని బయటపెట్టింది. ‘విధి’ సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేయడంతో పాటు థ్రిల్ కూడా చేస్తుందని చెప్పింది. ఆనంది తెలుగమ్మాయే అయినా.. తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ.. కోలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. తమిళంలో పలు హిట్ చిత్రాలలో నటించిన తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’తో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఇక ఆ మూవీ తర్వాత హీరోయిన్‌గా ఆనంది నటిస్తున్న రెండో తెలుగు చిత్రం ‘విధి’. శ్రీనాథ్, శ్రీకాంత్.. అన్నాదమ్ములుగా కలిసి చేస్తున్న చిత్రం కాబట్టి వారిద్దరూ ‘విధి’పై పూర్తిగా నమ్మకంతో ఉన్నారు.
Also Read: విడాకులపై స్వాతి జవాబుకు హరీష్ శంకర్ ఫిదా - శభాష్ అంటూ ప్రశంసలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial