అన్వేషించండి

Harish Shankar: విడాకులపై స్వాతి జవాబుకు హరీష్ శంకర్ ఫిదా - శభాష్ అంటూ ప్రశంసలు

ఒక్కొక్కసారి సెలబ్రిటీలు ఇచ్చే సమాధానాలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా విడాకుల ప్రశ్నకు స్వాతి ఇచ్చిన సమాధానం కూడా అలాగే అయ్యింది.

గత కొన్నిరోజులుగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై సోషల్ మీడియాలో మాత్రమే కాదు.. మీడియాలో కూడా ఆసక్తి పెరిగింది. అందుకే ఏదైనా సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నప్పుడు అయినా.. మామూలుగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అయినా.. వారికి సినిమాల గురించికంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్ గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎదురవుతున్న ప్రశ్నల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కానీ తాజాగా స్వాతి తన పర్సనల్ లైఫ్ గురించి ఎదురయిన ప్రశ్నకు చాలా స్మార్ట్‌గా సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ను సైతం ఇంప్రెస్ చేసింది.

స్వాతికి ఇంప్రెస్ అయిన హరీష్ శంకర్..
హరీష్ శంకర్.. ఓవైపు తాను తెరకెక్కిస్తున్న సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. బయట తనకు నచ్చని విషయం ఏదైనా ఉంటే.. దాని గురించి సోషల్ మీడియాలో చాలా ఘాటుగా స్పందించాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో బిజీగా ఉన్న హరీష్.. కొన్నిరోజులుగా తన సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా స్వాతిపై హరీష్ శంకర్ పెట్టిన పోస్ట్ కూడా అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంది. స్వాతిని ప్రశంసిస్తూ హరీష్ శంకర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

నేను చెప్పా..
గత కొన్నాళ్లుగా స్వాతి.. సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేదు. మళ్లీ ఇన్నాళ్లకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు ‘మంత్ ఆఫ్ మధు’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్.. ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో తన విడాకుల గురించి స్వాతికి ప్రశ్న ఎదురయ్యింది. ‘నేను చెప్పా’ అని ముక్కుసూటిగా విడాకుల గురించి సమాధానం ఇచ్చింది. ‘నేను ఇవ్వా’ అని చెప్పగా.. ‘విడాకులు ఇవ్వరా, సమాధానం ఇవ్వరా’ అని క్లియర్‌గా ప్రశ్నించారు ఆ జర్నలిస్ట్. అయితే దానికి సమాధానమే ఇవ్వను అని మరింత స్పష్టంగా సమాధానమిచ్చింది స్వాతి. దీంతో పర్సనల్ లైఫ్ గురించి ఇబ్బందికర ప్రశ్నలు వేసే జర్నలిస్ట్‌కు స్వాతి కరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చిందని నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. అందులో హరీష్ శంకర్ కూడా జాయిన్ అయ్యాడు.

శభాష్ స్వాతి..
స్వాతి.. విడాకుల గురించి ఎదురయిన ప్రశ్నకు సమాధానమిస్తున్న వీడియోను హరీష్ శంకర్.. తన ట్విటర్‌లో షేర్ చేశాడు. దానికి క్యాప్షన్‌గా ‘శభాష్ స్వాతి, కీప్ ఇట్ అప్’ అని పెట్టాడు. ఈ వీడియోలో తను విడాకుల గురించి మాట్లాడడం మాత్రమే కాదు.. 16 ఏళ్ల వయసులో తను కలర్స్‌తో తన కెరీర్ స్టార్ట్ చేశానని, ఆ సమయంలో సోషల్ మీడియాలో లేకపోవడం అదృష్టకరమని చెప్పుకొచ్చింది స్వాతి. ఈ వైరల్ వీడియోలో స్వాతి చెప్పిన ‘నేను ఇవ్వా, నేను చెప్పా’ అన్న సమాధానం మరింత వైరల్ అవుతోంది. ఇది తన ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా ప్రమోషన్‌కు కూడా బాగా ఉపయోగపడుతోంది. అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: 'ఉస్తాద్ భగత్ సింగ్'లో విలన్‌గా కోలీవుడ్ యాక్టర్?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget