అన్వేషించండి

Victory Venkatesh: నా గురించే ఆలోచిస్తున్నావా? నేను వచ్చే లోపల నలుగురిని కన్నావ్.. అని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నప్పుడు ఉంటుంది..!

Victory Venkatesh Interview: విక్టరీ వెంకటేష్ సినిమాలు అనగానే ముందు వరసలో ఉండేది ఫ్యామిలీ ఆడియన్సే. అలాంటి ఆడియన్స్ కోసం ఈ సంక్రాంతికి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌తో ఈ వెంకీమామ రాబోతున్నారు.

Victory Venkatesh About Sankranthiki Vasthunam: ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాల తర్వాత విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ‘సంక్రాంతి’ స్పెషల్‌గా జనవరి 14న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్..  సినిమాపై పండగ వాతావరణమే కాదు.. సక్సెస్ వైబ్‌ కూడా ఏర్పడేలా చేసింది. మరీ ముఖ్యంగా ‘గోదారి గట్టు’ పాట మోత మోగిపోతుంది. అదే మూడ్‌ని కంటిన్యూ చేస్తూ.. టీమ్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. అందులో భాగంగా ఈ చిత్ర విశేషాలను శనివారం హీరో విక్టరీ వెంకటేష్ మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

‘‘సంక్రాంతికి నా నుండి ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఒక క్లీన్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్‌తో ఈ సంక్రాంతికి వస్తుండటం చాలా ఆనందంగా వుంది. లిటిల్ క్రైమ్ ఎలిమెంట్ న్యూ జానర్ కూడా వుంది. ఈ సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటి వరకు అంతా పాజిటివ్‌గానే వుంది. నా కెరీర్‌లో సంక్రాంతికి వచ్చిన చాలా సినిమాలు పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాను. అసలీ సినిమా అనుకున్నప్పుడు.. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. ఈ లైనే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. మినిమం గ్యారెంటీ అని అక్కడే అర్థమైంది. అనిల్ రావిపూడిది, నాది సూపర్ హిట్ కాంబినేషన్. మేము చాలా ఫ్రెండ్లీగా వుంటాం. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇందులో మాత్రం కామెడీ స్టయిల్ డిఫరెంట్‌గా వుంటుంది. నా నుండి చాలా ఫ్రెష్ సీన్స్ ఇందులో వుంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. అనిల్‌తో మంచి ర్యాపో కుదిరింది. తనతో మళ్లీ మళ్లీ మూవీస్ చేయాలని ఉంది. తను ఈ సినిమాని 70 రోజుల్లో ఫినిష్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అనుకున్నదాని ప్రకారం అన్నీ అద్భుతంగా కుదిరాయి.

Also Readవెండితెరకు రాజకీయ రంగులు... తెలుగులో బెస్ట్ పొలిటికల్ ఫిలిమ్స్ - 'గేమ్ చేంజర్'కు ముందు... మీరెన్ని చూశారు?

చిత్ర ప్రమోషన్స్ అంత ఎనర్జిటిక్‌గా ఉండటానికి కారణం అనిల్ రావిపూడి. అంతే మిగతా అంతా నేచురల్‌గా అలా జరిగిపోయింది. నాకు మ్యూజిక్ చాలా నచ్చింది. అలాగే నాకు డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. మ్యూజిక్ ట్యూన్స్ వినగానే క్రేజీగా అనిపించింది. అలాగే డైరెక్టర్ అనిల్, ఇద్దరు హీరోయిన్స్.. లైవ్లీ టీమ్ సెట్టయింది. ప్రమోషన్స్‌లో ఏదైనా కొత్తగా చేయాలని అంతా అనుకున్నాం. ప్రేక్షకులు కూడా మా వర్క్‌ని ఎంజాయ్ చేయడం హ్యాపీగా అనిపించింది. సంగీత దర్శకుడు భీమ్స్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తనకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఫస్ట్ ట్యూన్ వినగానే హిట్ అనుకున్నాం. అది సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అది ఆడియన్స్ గొప్పదనం. ‘గోదారి గట్టు’ సాంగ్ 85 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఆ పాటే కాదు, అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరీ ప్రత్యేకంగా రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టు’ పాట పెద్ద హిట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాడారు. పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ఇక నేను పాడిన పాట గురించి చెప్పాలంటే.. నైట్ రెండు గంటలకి ఆ సాంగ్ విన్నప్పుడు తెలియకుండానే డ్యాన్స్ చేశాను. ఏదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్‌లో వుంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే వుంది. పాటలో ఇంగ్లీష్ వర్డ్స్ వుండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది.

ఇందులో అనిల్ రావిపూడి నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా సరదాగా అనిపించింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి.. నా గురించే ఆలోచిస్తున్నావా? నేను వచ్చే లోపల నలుగురిని కన్నావ్.. అన్నప్పుడు చాలా హిలేరియస్‌గా అనిపించింది. అలాంటి సీన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో నాకు నలుగురు పిల్లలు. అందులో ఒకడిని చాలా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. క్లైమాక్స్‌లో చెప్పే డైలాగ్స్ చాలా క్రేజీగా వుంటాయి. ఆడియన్స్ చాలా ఎంటర్‌టైన్ అవుతారు. యూత్ డైలాగ్స్‌ని చాలా లవ్ చేస్తారు. అలాగే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్.. ఇద్దరూ చాలా మంచి పాత్రలు చేశారు. చక్కగా పెర్ఫామ్ చేశారు. వారి క్యారెక్టర్స్ వెరీ క్రేజీగా వుంటాయి.

Also Read: 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే? 

నేను సెట్స్‌లో వుంటే నిర్మాత సెట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదని దిల్ రాజు గారు అనడం ఆయన గొప్పతనం. కానీ కచ్చితంగా నిర్మాతలు సెట్స్‌కు రావాలి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ప్రతి సినిమా నా సొంత సినిమాగా చేస్తాను. ప్రతి ఒక్కరూ హ్యాపీగా వుండాలని కోరుకునే మనిషిని నేను. ప్రతి సినిమాకు నేను సిన్సియర్‌గా పని చేస్తాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నుంచి ట్రావెల్ అవుతున్నాను. వారితో జర్నీ చాలా కంఫర్ట్ బుల్‌గా వుంటుంది. మేము చేసిన సినిమాన్నీ బాగా ఆడాయి. వారికి మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నాను. హానెస్ట్ అండ్ సిన్సియర్‌గా వర్క్ చేయడమే మన చేతిలో వుంటుంది. హిట్స్, ఫ్లాప్స్ మన చేతిలో వుండవు. మన కంట్రోల్‌లో లేని విషయాల గురించి నేను ఎక్కువగా థింక్ చేయను. 

ఫైనల్‌గా ప్రేక్షకులకు చెప్పేది ఒక్కటే.. వెరీ నైస్ ఫెస్టివల్ ఫిల్మ్‌తో వస్తున్నాం. కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ వుంటుంది. క్లైమాక్స్ చాలా సర్‌‌ప్రైజ్ చేస్తుంది. పిల్లలు, పెద్దలు, యూత్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఎప్పుడూ సోషల్ మీడియాలో పాజిటివ్ థింకింగ్‌తోనే పోస్ట్‌లు పెడతాను. లైఫ్‌లో పాజిటివ్‌గా వుండాలి. ఓవర్ థింకింగ్ అనవసరం. ఓ పాజిటివ్ థాట్‌తో డే మొదలు పెడితే ఆ రోజంతా జీవితం హాయిగా వుంటుందని నమ్మే వ్యక్తిని నేను. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్, సితార వంశీ, మైత్రీ మూవీ మేకర్స్, వైజయంతి మూవీస్ బ్యానర్‌లలో కథలపై వర్క్ జరుగుతుంది. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. ‘రానా నాయుడు 2’ డబ్బింగ్ పూర్తయింది. బహుశా మార్చిలో స్ట్రీమింగ్‌కు రావచ్చు.. ’’ అని విక్టరీ వెంకటేష్ చెప్పుకొచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget