Venu Swamy Astrologer: బాంబు పేల్చిన వేణు స్వామి... చైతు, శోభితలను టార్గెట్ చేస్తూ సెన్సేషనల్ పోస్ట్!
Naga Chaitanya Sobhita Dhulipala Engagement: అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. ఇంతలో వేణు స్వామి ఆ కొత్త జంటను టార్గెట్ చేశాడు.

Venu Swamy On Naga Chaitanya and Sobhita Dhulipala Engagement: అక్కినేని నాగ చైతన్య అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే, ఆయన కుటుంబ సభ్యులతో పాటు చిత్ర పరిశ్రమలో సన్నిహితులు, శ్రేయోభిలాషులు కూడా! శోభితా ధూళిపాళతో గురువారం ఉదయం నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరగడంతో అందరూ హ్యాపీ! ఆ సంతోషం మీద నీళ్లు చల్లుతూ ఫేమస్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి బాంబు పేల్చారు. కొత్త జంటను అప్పుడే టార్గెట్ చేశాడు.
మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుందో చెబుతాడట!
Naga Chaitanya Sobhita Dhulipala Marriage: ఎంగేజ్మెంట్ జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. ఉంగరాలు ఇలా మార్చుకున్నారో? లేదో? వేణు స్వామి అలా ఊడి పడ్డారు. వాళ్లిద్దరి మ్యారీడ్ లైఫ్ గురించి చెబుతానని తెలిపారు.
''నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు'' - ఇదీ వేణు స్వామి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో షేర్ చేసిన స్టోరీ. అది చూసిన కొందరు కాబోయే కొత్త జంటను ఆయన అప్పుడే టార్గెట్ చేశారని కామెంట్ చేస్తున్నారు.
చైతన్య, సమంత విడాకులతో పాపులర్!
Is Venu Swamy a good astrologer?: వేణు స్వామి చెప్పేది నిజమా? అబద్ధమా? ఆయన విశ్లేషణలు నిజం అవుతాయా? లేదా? అనేది పక్కన పెడితే... ఆయన పాపులర్ కావడానికి కారణం నాగ చైతన్య మొదటి వివాహం. సమంత, చైతన్య జంట బావుందని, వాళ్లిద్దరూ ఆదర్శ దంపతులు అని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్న సమయంలో ''చై సామ్ విడాకులు తీసుకుంటారు'' అని బాంబు పేల్చారు వేణు స్వామి. ఆ తర్వాత ఆయన చెప్పింది నిజం కావడంతో తాను చెప్పేది 100 పర్సెంట్ జరుగుతుందని పబ్లిసిటీ చేసుకున్నారు.
వేణు స్వామి చెప్పినవి కొన్ని జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి కెసిఆర్ నేతృత్వంలో భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అలాగే, ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు అధికారం చేపడతారని కూడా చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన చెప్పినవి జరగలేదు. దాంతో నెటిజనులు ట్రోల్ చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల ఫలితాల గురించి ఆయన చెప్పిన మాటలు అయితే అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' ఫ్లాప్స్ కావడంతో అప్పుడు మౌనంగా ఉన్నారు. 'సలార్', 'కల్కి 2898 ఏడీ' విడుదల తర్వాత ఊరుకోలేదు. వసూళ్ల లెక్కలతో విరుచుకుపడ్డారు. ఏపీ ఫలితాల తర్వాత తాను జాతకాలు చెప్పడానికి దూరంగా ఉంటానని వేణు స్వామి తెలిపారు. కట్ చేస్తే... నాగ చైతన్య నిశ్చితార్థం తర్వాత బయటకు వచ్చారు. మధ్యలో కొన్ని కొన్ని అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ... చైతూ ఎంగేజ్మెంట్ మీద ఏం చెబుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

