Mega 157 Title Glimpse: మెగా 157 టైటిల్ గ్లింప్స్‌కు విక్టరీ టచ్... చిరు కొత్త సినిమా టైటిల్, ఆ వీడియోలో స్పెషాలిటీ తెలుసా?
Mana Shankara Vara Prasad Garu: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నారు. చిరు బర్త్ డే స్పెషల్‌గా ఆగస్టు 22న టైటిల్ గ్లింప్స్ విడుదలవుతోంది. దాని స్పెషాలిటీ ఏమిటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు తమ ఫేవరేట్ హీరో పుట్టినరోజు (Chiranjeevi Birthday)కు డబుల్ ధమాకా కాదు... ట్రిపుల్ ధమాకా అందుతోంది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ సైతం ఎక్కువగా ఎదురు చూసేది ప్రతి సినిమాతోనూ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్ళు కొల్లగొడుతున్న హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా అప్డేట్ కోసం! దాని స్పెషాలిటీ ఏమిటో తెలుసా?
విక్టరీ వాయిస్ ఓవర్‌తో మెగా టైటిల్ గ్లింప్స్!
చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాకు 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) టైటిల్ ఖరారు చేశారు. అయితే అదొక్కటే ఉండబోదు... 'పండక్కి వస్తున్నారు' అనేది కూడా ఉంటుందని తెలిసింది. అదీ సంగతి!
చిరు సినిమా టైటిల్ 'మన శంకర వరప్రసాద్ గారు' అని కొన్ని రోజుల నుంచి ఫిల్మ్ నగర్ వర్గాలతో పాటు యూనిట్ నుంచి లీక్స్ వచ్చాయి. ఫ్యాన్స్ అందరికీ ఆ టైటిల్ న్యూస్ తెలుసు. అసలు మేటర్ ఏమిటంటే... విక్టరీ వెంకటేష్ గొంతులో నుంచి ఆ పేరు ప్రేక్షకులు వినబోతున్నారు. మెగా 157 టైటిల్ గ్లింప్స్‌కు వెంకీ మామ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన టైటిల్ ఎలా రివీల్ చేశారు? అనేది తెలియాలంటే ఆగస్టు 22వ తేదీ ఉదయం 11.25 గంటల వరకు వెయిట్ చేయక తప్పదు.
'మన శంకర వరప్రసాద్ గారు' టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు రిలీజ్ గురించి ఓ హింట్ ఇస్తున్నారు అనిల్ రావిపూడి. 'పండక్కి వస్తున్నారు' అని చెప్పడంతో తమ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి రాబోతుందని స్పష్టం చేశారు. సంక్రాంతి 2026 బరిలో చిరు సినిమా రావడం గ్యారెంటీ. వెంకటేష్, అనిల్ రావిపూడిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు వచ్చాయి. చిరంజీవితో వెంకీకి మంచి స్నేహం ఉంది. అందువల్ల, 'మన శంకర్ వరప్రసాద్ గారు'లో కీలకమైన క్యారెక్టర్ చేయమని అడిగితే వెంకటేష్ ఒప్పేసుకున్నారు. సినిమాలో ఆయన సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: 'విశ్వంభర' వాయిదా... థియేటర్లలోకి వచ్చేది 2026 వేసవిలోనే - క్లారిటీగా చెప్పిన చిరంజీవి
Mana Shankara Vara Prasad Garu Cast: చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమాలో కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
చిరంజీవి పుట్టినరోజుకు వచ్చే అప్డేట్స్ ఏమిటంటే?
Chiranjeevi Birthday Special Updates 2025: చిరు పుట్టినరోజు (ఆగస్టు 22న) ట్రిపుల్ ధమాకా అని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో మొదటిది... బర్త్ డేకు ముందు రోజు (ఆగస్టు 21) సాయంత్రం 'విశ్వంభర' గ్లింప్స్ విడుదల కానుంది. ఇక ముఖ్యమైన 'మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు' టైటిల్ గ్లింప్స్ శుక్రవారం ఉదయం 11.25 గంటలకు రానుంది. ఆ రోజు సాయంత్రం కొత్త సినిమా అనౌన్స్ చేయనున్నారు. 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీ కొల్లితో మరొక సినిమా చేస్తున్నారు చిరు. ఆ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేయనుంది.





















