Daksha Nagarkar: మెగా హీరో సినిమాలో స్పెషల్ సాంగ్... హారర్ కామెడీలో ఐటమ్ భామ ఈ అమ్మాయే
Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కొరియన్ కనకరాజు'. ఇందులో స్పెషల్ సాంగ్ ఉంది. ప్రస్తుతం ఆ పాట చిత్రీకరణ జరుగుతోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'కొరియన్ కనకరాజు'. టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు అనుకోండి. హీరోగా వరుణ్ తేజ్ 15వ (VT15) చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
'కొరియన్ కనకరాజు'లో ఐటమ్ భామ ఈ అమ్మాయే!
హీరోయిన్ దక్షా నాగర్కర్ గుర్తు ఉందా? సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్ కంటే ఆ అమ్మాయిని పాపులర్ చేస్తుంది ఒక వైరల్ వింక్ మూమెంట్. అక్కినేని తండ్రి కొడుకులు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా 'బంగార్రాజు'. అందులో 'ఎంత సక్కగుందిరో...' పాటలో దక్ష సందడి చేసింది.
View this post on Instagram
'బంగార్రాజు'లో 'ఎంత సక్కగుందిరో...' పాట కంటే... సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు నాగ చైతన్యను చూసి కన్ను గీటుతుంది. ఆ వీడియో వైరల్ కావడంతో దక్షకు బోలెడంత పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ సొంతం చేసుకుంది. ఆవిడ instagram స్టోరీలో పోస్ట్ చేసిన ఫోటోను బట్టి ఈ సినిమా సాంగ్ చేస్తున్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. 'బంగార్రాజు' కంటే ముందు 'జాంబి రెడ్డి' సినిమాలో హీరోయిన్ రోల్ చేసింది దక్ష.
Also Read: క్యాప్ లేకుండా కనిపించిన మహేష్... కొత్త హెయిర్ స్టైల్... రాజమౌళి మూవీలో ఈ లక్కుంటే రచ్చ రచ్చే
View this post on Instagram
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, యువి నిర్మాణంలో!
'కొరియన్ కనకరాజు'కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇందులో సత్య ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. హారర్ కామెడీగా రూపొందుతున్న చిత్రమిది. ఇండో కొరియన్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఇందులో రితికా నాయక్ హీరోయిన్. ఈ మూవీకి తమన్ సంగీత దర్శకుడు.
Also Read: శేష్ మామూలోడు కాదు... స్టేజి మీద 'హిట్ 3' హీరోయిన్ శ్రీనిధికి షాక్ ఇచ్చాడు... వైరల్ వీడియో చూడండి





















