అన్వేషించండి

Baby John: ‘బేబీ జాన్‌’ టీజర్‌ వచ్చేసింది, మాస్ ఎలివేషన్స్​తో దుమ్మురేపిన వరుణ్!

వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘బేబీ జాన్‌‘. కాలీస్‌ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Baby John Movie Taster Cut : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘తెరి‘ హిందీలో ‘బేబీ జాన్‘గా రీమేక్ అవుతున్నది. వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రానికి  కాలీస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా టీజర్ ను విడుదల చేసింది.   

యాక్షన్ అవతార్ లో అదరగొట్టిన వరుణ్ ధావన్

తమిళ ‘తెరి’లో విజయ్ దళపతి, సమంత, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషించగా.. ‘బేబీ జాన్’ సినిమాలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి నటిస్తున్నారు. టీజర్ చూస్తుంటే, తమిళ చిత్రాన్ని.. ఉన్నది ఉన్నట్లుగా దించేసినట్లు అర్థం అవుతోంది. అయితే, తమిళ సినిమాల్లోనే హీరో ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే.. హిందీ సినిమాలో మరింత మసాలా మిక్స్ చేశారు. వరుణ్ ను ఓ రేంజ్ లో హైలెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు తెలుగు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ అదుర్స్ అనిపించింది. టీజర్ కు ఆయన మ్యూజిక్ మాంచి ఊపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నది.

డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న 'బేబీ జాన్'

'బేబీ జాన్' సినిమా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కలీస్, ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. మురాద్‌ ఖేతానీ, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను దర్శకుడు అట్లీ షేర్ చేశాడు. చాలా రోజులగా బాలీవుడ్‌ లో సరైన మాస్ మూవీ రాలేదు. 'బేబీ జాన్' సినిమాతో ఆ లోటు తీరే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

‘పోలీసోడు’ పేరుతో తెలుగులో విడుదల

తమిళ హీరో విజయ్ దళపతి నటించిన ‘తెరి’ సినిమాను, తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా చాలా కాలం క్రితమే ప్రారంభం అయినప్పటికీ, ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.  పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో ఆయన పూర్తిగా రాజకీయాల మీదే ఫోకస్ పెట్టారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలు సగంలోనే ఆగిపోయాయి. మరోవైపు 'తెరి'ని హిందీలో 'బేబీ జాన్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 

Read Also: ఆ హీరోతో స్పెషల్ సాంగ్ చేయాలనుంది, అసలు విషయం చెప్పేసిన హన్సిక

టాప్ హెడ్ లైన్స్

Peddi Collections Day 4: ఆదివారం బాక్సాఫీస్‌లో 'పెద్ది'గాడి ఊచకోత... రామ్ చరణ్ నయా రికార్డు... నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ఆదివారం బాక్సాఫీస్‌లో 'పెద్ది'గాడి ఊచకోత... రామ్ చరణ్ నయా రికార్డు... నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
Drishyam 3 OTT : దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
దృశ్యం 3 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Rashmika Mandanna: సాయి పల్లవి, రుక్మిణీ వసంత్‌ను కాదని రష్మిక దగ్గరకు... లుక్ టెస్ట్ కూడా!
సాయి పల్లవి, రుక్మిణీ వసంత్‌ను కాదని రష్మిక దగ్గరకు... లుక్ టెస్ట్ కూడా!

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీలో 2 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Maruti Suzuki Announces Attractive Discounts: మారుతి సుజుకి కార్లపై ఊహించని రేంజ్ లో ఆఫర్ల వర్షం: కొత్త కార్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్..
కొత్త కార్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్.. విక్టోరిస్ మోడల్ పై భారీ తగ్గింపు.. స్విఫ్ట్, బ్రెజ్జా, వ్యాగన్ ఆర్ పై అదిరే ఆఫర్లు
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Embed widget