(Source: Poll of Polls)
Varalaxmi Sarathkumar: చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను, థెరపీకి వెళ్లాను - వరలక్ష్మి శరత్‌కుమార్
Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్‌కుమార్.. తనకు నచ్చని విషయాన్ని ఎలా అయితే గట్టిగా చెప్తుందో.. తన అభిప్రాయాలను కూడా అలాగే చెప్పేస్తుంది. తాజాగా తన జీవితంలో జరిగిన ట్రామా గురించి బయటపెట్టింది.
Varalaxmi Sarathkumar About Child Abuse: వెండితెరపై లేడీ విలన్స్ అనేవారు అస్సలు కనిపించని సమయంలో లేడీ విలన్‌గా వచ్చిన మొదటి ఛాన్స్‌తోనే టాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్‌ను తనవైపు తిప్పుకుంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చినా నో చెప్పకుండా చేసింది. ఇప్పుడు ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపిస్తోంది వరలక్ష్మి శరత్‌కుమార్. త్వరలోనే ‘శబరి’ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తను పాల్గొన్న ఇంటర్వ్యూలో కొన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంది వరలక్ష్మి.
సాయం అడగాలి..
‘‘ప్రతీ ఒక్కరి జీవితంలో గతంలో జరిగిన ఏదో ఒక గాయం అనేది గుర్తుండిపోతుంది. నేను ఇంతకు ముందు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను. అదే నా జీవితంలో మర్చిపోలేని గాయం. దానికోసం థెరపీకి కూడా వెళ్లాను’’ అంటూ మరోసారి తను చిన్నప్పుడు లైంగికంగా ఎదురైన ఇబ్బందుల గురించి గుర్తుచేసుకుంది వరలక్ష్మి శరత్‌కుమార్. అంతే కాకుండా అసలు ట్రామా అనేదాన్ని ఎలా ఎదుర్కోవాలి అని కూడా సలహా ఇచ్చింది. ‘‘జీవితంలో ట్రామా ఉన్నప్పుడు కచ్చితంగా ఎవరినైనా సాయం అడగాలి. ఈరోజుల్లో మెంటల్ హెల్త్ గురించి చాలామంది ఓపెన్‌గా మాట్లాడడం చాలా మంచిది’’ అని చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్‌కుమార్.
థెరపీ అనేది చాలా ముఖ్యం..
‘‘ఒకప్పుడు జనరేషన్‌లో సైకలాజికల్ ప్రాబ్లమ్ అంటే తనకు మెంటల్ అందుకే సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్తుంది అనేవారు. థెరపిస్ట్ దగ్గరకు వెళ్తున్నామన్నా కూడా మెంటల్ అని అనేవారు. ప్రతీ ఒక్కరికి ఒక థెరపిస్ట్ ఉంటే బాగుంటుంది. దాని వల్ల నీ జీవితాన్ని మూడో వ్యక్తి ఏ దృష్టితో చూస్తున్నాడు అనేది నీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ దగ్గర నీ సమస్యల గురించి మాట్లాడితే జడ్జ్ చేస్తారు, వారి అభిప్రాయాలు చెప్తుంటారు. అదే థెరపిస్ట్‌తో మాట్లాడితే అలా ఉండదు. మనల్ని సరైన మార్గంలో నడిపించడమే ఒక థెరపిస్ట్ పని. అందుకే మనకు ఏమైనా సమస్యలు ఉంటే థెరపిస్ట్ దగ్గరకు వెళ్లి వాటిని నయం చేసుకోవడం ముఖ్యం’’ అంటూ థెరపీ అనేది ప్రతీ ఒక్కరికీ ఎంత ముఖ్యమో తెలిపింది వరలక్ష్మి.
ఎవరినీ పట్టించుకోను..
ఇక తనకు సినిమా అంటే ఏంటి అని అడగగా జీవితం అని చెప్తూ నవ్వింది వరలక్ష్మి శరత్‌కుమార్. మూవీ అంటే ఏంటని చెప్తూ.. మూడు గంటలు ప్రేక్షకులంతా తమ పర్సనల్ సమస్యలను మర్చిపోయి వేరే ప్రపంచానికి వచ్చి ఎంజాయ్ చేస్తారు అని తన అభిప్రాయన్ని బయటపెట్టింది. తనకు ఒత్తిడి కలిగినప్పుడు పనిచేస్తేనే సంతోషంగా ఉంటానని, అదే తన స్ట్రెస్‌బస్టర్ అని చెప్పుకొచ్చింది. చాలామంది తనను చాలా టఫ్ అనుకోవడంపై కూడా స్పందించింది. తనకు దగ్గరయిన వాళ్లకు తన గురించి తెలిస్తే చాలని, అందరూ తన గురించి ఏమనుకుంటున్నారో తాను అస్సలు పట్టించుకోనని తేల్చిచెప్పింది వరలక్ష్మి శరత్‌కుమార్.
Also Read: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్ - ధర తెలిస్తే అవాక్కావ్వాల్సిందే, ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసా?