కామెంట్ పెట్టండి, పచ్చడి పట్టండి - సుమ ‘ప్రాజెక్ట్ A’ ఆఫర్

సుమ ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీ వీడియోలను అప్లోడ్ చేస్తుంటుంది.

తాజాగా ‘ప్రాజెక్ట్ A’ పేరుతో తన యూట్యూబ్ కొత్త వ్లాగ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది సుమ.

ప్రోమో చివర్లో మాత్రమే ఇది ఆవకాయ మేకింగ్‌పై సుమ షూట్ చేసిన స్పెషల్ వీడియో అని అర్థమవుతుంది.

ఎప్పటినుండో తన ఫ్యాన్స్‌కు ఏదైనా చేయాలని అనుకుంటున్నానంటూ వారందరికీ ఒక ఆఫర్‌ను కూడా ఇచ్చింది.

తన ఛానెల్‌లో ‘ప్రాజెక్ట్ A’ చూసి కామెంట్స్ చేసే అయిదుగురికి స్పెషల్ ట్రీట్ ఇవ్వనుంది.

ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినవారికి తను చేసిన ఆవకాయను ప్యాక్ చేసి పంపిస్తానని ప్రకటించింది సుమ.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కామెంట్ పెట్టి.. పచ్చడి కొట్టేయండి.

All Images and Video Credit: Suma Kanakala/Instagram

Thanks for Reading. UP NEXT

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటి దివ్యాంక త్రిపాఠి - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక

View next story