సత్యశ్రీ ‘జబర్దస్త్’ అందాలు - హీరోయిన్‌లకు పోటీ ఇస్తున్న లాఫింగ్ బ్యూటీ సత్యశ్రీ అనగానే మనకు వెంటనే ‘జబర్దస్త్’లో చమ్మక్ చంద్ర స్కిట్టే గుర్తుకొస్తుంది. స్కిట్‌కు చంద్ర డైలాగులు ఒక ప్లస్ అయ్యితే.. సత్యశ్రీ టైమింగ్, అందం మరింత ప్రత్యేకం. చంద్రాతోపాటు సత్యశ్రీ కొన్నాళ్లు ‘జబర్దస్త్’ వదిలేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మా టీవీలో వచ్చిన కొన్ని కామెడీ షోస్‌లోనూ సత్యశ్రీ మెరిసింది. ఈ మధ్య సత్యశ్రీకి సినిమాల్లో కూడా ఛాన్సులు బాగానే వస్తున్నాయ్. ఇటీవల విడుదలైన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీలో తళుక్కున్న మెరిసింది సత్యశ్రీ. ‘‘నా పెట్టి తాళం తీసి.. చాలా రోజులు అయినది’’ పాటతో పాపులారిటీ సంపాదించింది. సినిమాలు, స్కిట్స్‌లో చాలా పద్ధతిగా కనిపించే సత్యశ్రీ.. సోషల్ మీడియాలో మాత్రం భిన్నంగా ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ ఔరా అనిపిస్తున్నాయి. ఆమెలో హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.