కుమారీ ఆంటీలా మారిపోయిన సుమ, రీమిక్స్ సాంగ్ అదుర్స్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భవిష్యత్తులో ఆమె యాంకర్‌గా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సుమ రంగంలోకి దిగిందంటే పంచుల వర్షం కురవాల్సిందే. ఈ మధ్య సుమ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. రీల్స్‌తో ఆకట్టుకుంటోంది. ఫన్నీ వీడియోలతో నవ్విస్తోంది. తాజాగా కుమారి ఆంటీని అనుకరిస్తూ ఒక ఫన్నీ వీడియోను వదిలింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా, మీ బిల్లు రూ.1000 అంటూ రీమిక్స్ సాంగ్ చేసింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వేస్తారు.