గుప్పెడంత మనసు సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది.
ఇందులో హీరో రిషిగా నటిస్తోన్న ముఖేష్ గౌడకి అదిరే ఫాలోయింగ్ ఉంది
దాదాపు రెండువారాల పాటూ సీరియల్ లో రిషి కనిపించకపోయేసరికి అల్లాడిపోయారు ప్రేక్షకులు
కొంపతీసి హీరోని మారుస్తారా ఏంటనే డిస్కషన్ జరిగాయ్
సాధారణంగా సీరియల్స్ లో సెడెన్ గా క్యారెక్టర్స్ ని మార్చేస్తుంటారు
ఏ సీరియల్ సంగతేమో కానీ గుప్పెడంతమనసులో హీరో ఆటిట్యూడ్ కి రిషి లుక్ పర్ ఫెక్ట్
స్టోరీతో పాటూ రిషి లుక్, నటనకు స్మాల్ స్క్రీన్ పై మామూలు ఫాలోయింగ్ లేదు
అసలు రిషి - వసుధార కోసమే సీరియల్ చూసేవారున్నారు. ఇలాంటి టైమ్ లో రిషి ప్లేస్ లో మరొకర్ని తీసుకొస్తే మాత్రం సీరియల్ ఫ్లాప్ అవడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్
రెండు వారాల తర్వాత రిషి సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కానీ..మునుపటి జోష్ ప్రస్తుతానికి లేదు..
ఇంతకీ బ్రేక్ ఎందుకు తీసుకున్నాడంటే..జిమ్ లో గాయపడి బెడ్ రెస్టులో ఉన్నాడట.. All Image Credit: Mukesh Gowda/ Instagram