మోనితా స్క్రీన్ నేమ్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది శోభాశెట్టి. ఆ పాపులారిటీ ఆమెకు ‘బిగ్ బాస్’లో ఛాన్స్ ఇచ్చింది. ‘బిగ్ బాస్ సీజన్-7’లో బోలెడంత నెగిటివిటీ మూటగట్టుకున్న ఏకైక బ్యూటీ శోభ. అన్నీ బాగుంటే టాప్-5లోకి వెళ్లాల్సి ఉండేది. కానీ, ప్రేక్షకులు ఆమెను ఓడించారు. శోభా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు చాలా ముద్దుగా, బొద్దుగా ఉండేది. అయితే, హౌస్ నుంచి బయటకు రాగానే చాలా మార్పు కనిపించింది. హౌస్‌లో డైట్ వల్లో, బాధ వల్లో తెలీదుగానీ.. బాగా చిక్కిపోయింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి.. నెటిజన్స్ అదే అంటున్నారు. ‘బిగ్ బాస్’లోకి వెళ్లడానికి కొద్ది రోజుల ముందు శోభా శెట్టి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇలా... Images and Video Credit: Shobha Shetty