‘జబర్దస్త్’ వర్ష కిడ్నాప్‌కు గురైంది. అదేంటీ షాకయ్యారా? ఔనండి, నిజం. కానీ, చిన్న ట్విస్ట్ ఉంది. వర్షా తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె రాత్రివేళ ఎవరితోనో కలిసి రోడ్డుపై నడుస్తోంది. ఇంతలో కొంతమంది యువకులు ఆమెతో ఉన్న అబ్బాయిని పట్టుకుని వర్షాను కిడ్నాప్ చేయాలనుకున్నారు. ఆమెను బంధించడం కోసం కిడ్నాపర్లు కారు డిక్కీ తెరిచారు. డిక్కీలో కేకును చూసి వర్షా షాకైంది. వెంటనే ఆ యువకులు ఆమెకు హ్యాపీ బర్త్‌డే చెప్పారు. ఈ ప్రాంక్ వీడియోను వర్షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియో ఇదే. మీరూ చూసేయండి. చూశారుగా, అయితే.. ఇదంతా తన బర్త్‌డే సందర్భంగా ఫ్రెండ్స్ ప్రాంక్ అట. తనకు తెలియకుండా చేశారట. Images and videos Credit: Varsha/Instagram