Krishna Birth Anniversary: 'పోలీస్ కంప్లైంట్'లో సూపర్ స్టార్ కృష్ణ... వరలక్ష్మి హారర్ థ్రిల్లర్‌లో సర్‌ప్రైజ్ ఏమిటంటే?
Varalaxmi Sarathkumar: సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా 'పోలీస్ కంప్లైంట్' సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు, కృష్ణకు సంబంధం ఏమిటంటే?

సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని జయంతి (Krishna Birth Anniversary) నేడు (మే 31). ఈ సందర్భంగా 'పోలీస్ కంప్లైంట్' సినిమాలో నుంచి వర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాకు, కృష్ణకు సంబంధం ఏమిటి? అంటే...
'పోలీస్ కంప్లైంట్'లో కృష్ణ... సర్‌ప్రైజ్!
'పోలీస్ కంప్లైంట్' సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు. అంటే... ఆయన యాక్ట్ చేయలేదు. కానీ, ఆయన స్పెషల్ సాంగ్ ఒకటి షూట్ చేశారు. అది సినిమాకు మెయిన్ హైలైట్ అవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు.
హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో 'పోలీస్ కంప్లైంట్' తెరకెక్కుతోందని దర్శక నిర్మాతలు చెప్పారు. ఎమ్మెస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంస్థలపై సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'అఘోర' (తెలుగు, తమిళం), 'ఆప్త', 'పౌరుషం', 'ఆదిపర్వం' ఫేమ్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, అమిత్, 'దిల్' రమేష్, రాజశ్రీ నాయర్, సింగపూర్ బాలకృష్ణ, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహర్ష కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: శ్రీలీల ఇంట్లో ఫంక్షన్... ఎంగేజ్‌మెంట్ కాదండీ బాబూ... ఇదీ వైరల్ ఫోటో వెనుక అసలు మ్యాటర్
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ... ''వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాక మంచి రెస్పాన్స్ వచ్చింది. 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది" అని చెప్పారు. నిర్మాతలు సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ... ''వరలక్ష్మి రోల్ సినిమాకు హైలైట్ అవుతుంది. కృష్ణ గారిపై చేసిన స్పెషల్ సాంగ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. యాక్షన్, హారర్, థ్రిల్లింగ్ అంశాలతో భారీ ఎత్తున సినిమా తీస్తున్నాం'' అని తెలిపారు.
Also Read: ఆస్కార్ విన్నర్ డైరెక్షన్‌లో దిశా పటానీ... హాలీవుడ్ డెబ్యూ ప్లానింగ్ మామూలుగా లేదుగా
Police Complaint Movie Cast And Crew: వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర, శరత్ లోహితస్య, పృథ్వీ (యానిమల్), శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, 'జెమినీ' సురేష్, 'జబర్దస్త్' నవీన్, 'బేబీ' తనస్వి (పొట్టేలు ఫేమ్) తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఛాయాగ్రహణం: ఎస్.ఎన్. హరీష్, కూర్పు: ఆర్.ఎం. విశ్వనాథ్, సంగీతం: ఆరోహణ సుధీంద్ర - సుధాకర్ మారియో - సంజీవ్ మేగోటి, సాహిత్యం: సాగర్ నారాయణ - సంజీవ్ మేగోటి - చింతల ప్రసన్న రాములు, కళా దర్శకుడు: మురళీధర్ కొండపనేని, ఫైట్స్: 'డ్రాగన్' ప్రకాష్ - రవితేజ, నిర్మాతలు: 'సింగపూర్' బాలకృష్ణ - మల్లెల ప్రభాకర్, దర్శకత్వం: సంజీవ్ మేగోటి.





















