అన్వేషించండి

Usha Uthup: ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త జానీ చాకో మృతి - వీరిది ఓ అరుదైన ప్రేమకథ!

Usha Uthup Husband: ఇండియన్ ఫీమేల్ పాప్ సింగర్‌గా అప్పట్లోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు ఉషా ఉతుప్. తాజాగా తన భర్త జానీ చాకో గుండెపోటుతో మరణించారు.

Usha Uthup Husband Died: ప్రముఖ గాయని పద్మభూషణ్ అవార్డ్ గ్రహిత ఉషా ఉతుప్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త జానీ చాకో.. సోమవారం గుండెపోటుతో మరణించారు. ఉషా అభిమానులు, మ్యూజిక్, సినీ ఇండస్ట్రీ పెద్దలు జానీ చాకో మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. అయితే, ఉషాకు జానీ రెండో భర్త. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జానీ తన ప్రేమను నేరుగా ఆమె మొదటి భర్త దగ్గరే వ్యక్తం చేయడం విశేషం. ఈ విషయాన్ని ఉష ఉతుప్ తన బయోగ్రాఫీలో వెల్లడించారు.

బయోగ్రాఫీలో లవ్ స్టోరీ..

ఉషా ఉతుప్.. తన కెరీర్‌లో ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. అలాగే 1969లో కోలకత్తాలోని ట్రింకాస్ అనే నైట్ క్లబ్‌లో ఒకరోజు ఉషా ఉతుప్ పర్ఫార్మ్ చేయడానికి వెళ్లారు. అక్కడే మొదటిసారి జానీ చాకోను చూశారు. అప్పటికే ఉషా ఉతుప్‌కు రాము అనే వ్యక్తితో పెళ్లయ్యింది. ఈ విషయాన్ని ఉషా ఉతుప్ బయోగ్రాఫీలో రాసుకున్నారు. 2022లో వికాస్ కుమార్ ఝా అనే రచయిత.. ‘ది బుక్ ఆఫ్ ఇండియన్ పాప్ - ది ఆథరైజ్డ్ బయోగ్రాఫీ ఆఫ్ ఉషా ఉతుప్’ అనే బయోగ్రాఫీని రాశారు. ఆ పుస్తకంలో ఈ పాపులర్ సింగర్ పర్సనల్ లైఫ్ గురించి ఫ్యాన్స్‌కు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో తన మొదటి భర్త గురించి ఉంది.

మొదటి భర్తతో స్నేహం..

1969లో ట్రింకాస్‌లో పర్ఫార్మ్ చేయడం కోసం ఉషా ఉతుప్.. ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో వరుసగా పర్ఫార్మెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉండడంతో తన మొదటి భర్త రాము కూడా తనతో పాటు కోలకత్తా వచ్చారు. అక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తున్న సమయంలోనే ఆమె జానీని మొదటిసారి చూశారు. అప్పుడే రాము, జానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం గమనించారు. కోలకత్తాలో రాముకు కంపెనీ దొరికిందని ఉషా సంతోషించారు. ఆ తర్వాత రోజు తమ ఇంటికి భోజనానికి రమ్మని జానీని ఆహ్వానించారు రాము. ఆ మరుసటి రోజు ట్రింకాస్‌లో ఉషా ఉతుప్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు జానీ అక్కడే ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా ఆమెకు రాము మాత్రం కనిపించలేదు. అందుకే పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఉషాను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పారు జానీ. కానీ ఆ జర్నీలో వారు ఏమీ మాట్లాడుకోలేదు.

మీ భార్యను ప్రేమిస్తున్నాను..

ఉషా ఉతుప్ ఆటోబయోగ్రాఫీలో రాసినదాని ప్రకారం ఆరోజు ఇంటికి చేరుకోగానే ఏం జరిగిందంటే.. ఉషాతో వచ్చిన జానీని చూసి రాము మొహం మాడిపోయింది. ఉషా లోపలికి వచ్చారు. వెంటనే జానీని అక్కడినుంచి వెళ్లిపోమన్నారు రాము. మామూలుగా చాలా సైలెంట్‌గా ఉండే తన భర్తకు ఏమైందా అని అనుకున్నారు ఉషా. వెంటనే రాము తలుపు వేసేశారు. ఆ తర్వాత అసలు జానీ నాకు రెస్టారెంట్‌లో ఏం చెప్పాడో తెలుసా అని ఉషాతో చెప్పుకొచ్చారు. నాకు ఉషా గురించి తెలియదు. కానీ నేను నీ భార్యతో ప్రేమలో పడిపోయాను అన్నారు. నీకు కూడా జానీ అంటే ఇష్టమా అని అడగగా అవును అని ఉషా చెప్పారు అని పుస్తకంలో ఉంది. ఆ తర్వాత వారి మధ్య దూరం పెరిగి విడిపోయారని, ఆపై ఉషా.. జానీని పెళ్లి చేసుకున్నారు.

Also Read: అలా చేయడం మంచిదేనంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ - రణవీర్ కోసమేనా? అంటూ నెటిజన్లు సందేహం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget