Upasana Konidela: అమ్మతో కలిసి వంట చేసిన రామ్ చరణ్ - వీడియో షేర్ చేసిన ఉపాసన
Upasana Konidela: తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా ఒక క్యూట్ వీడియోను షేర్ చేశారు ఉపాసన. అందులో రామ్ చరణ్, సురేఖ కలిసి కిచెన్‌లో వంట చేస్తూ కనిపించారు.
Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కుదిరినప్పుడల్లా తన ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ దాని గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు. ఫ్యామిలీ టైమ్ అంటే అప్పుడప్పుడు కిచెన్‌లో వంట చేయడానికి తన తండ్రికి, భార్యకు హెల్ప్ చేయడానికి కూడా రామ్ చరణ్ ప్రయత్నిస్తుంటారు. తాజాగా అలా కిచెన్‌లో చరణ్ వంట చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేరర్ చేశారు ఉపాసన. దీన్ని బట్టి చూస్తుంటే సురేఖతో కలిసి రామ్ చరణ్, ఉపాసన క్వాలిటీ టైమ్ గడుపుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ వీడియో తమ కొత్త బిజినెస్‌ను ప్రమోట్ చేయడానికి అని అర్థమవుతోంది.
ఏం వండుతున్నారండి..
ఉపాసన కొణిదెల షేర్ చేసిన ఈ వీడియోలో ‘‘అత్తమ్మ గారండి కిచెన్‌లో ఏం అవుతోంది’’ అని ఉపాసన అడిగారు. దానికి తాను ఏం వంట చేస్తున్నానో చెప్పారు సురేఖ. ఆ తర్వాత కిచెన్‌లో రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యారు. తనను కూడా ఏం వంట చేస్తున్నారని ఉపాసన అడిగారు. ఇక ఇదంతా ఉమెన్స్ డే సందర్భంగా జరిగిందని, ప్రతీరోజూ ఉమెన్స్ డే అయితే బాగుంటుందని వీడియోను ముగించారు. ప్రస్తుతం ఈ వీడియోను మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఈ స్పెషల్ వీడియోకు ‘ఉమెన్స్ డే స్పెషల్’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దాంతో పాటు హ్యాష్‌ట్యాగ్‌లో ‘అత్తమ్మస్ కిచెన్’ అని జతచేశారు. అత్తమ్మస్ కిచెన్ అనేది ఉపాసన, సురేఖ కలిసి ప్రారంభించిన కొత్త బిజినెస్.
View this post on Instagram
ఆ రెసిపీలతో..
ఇటీవల సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా ‘అత్తమ్మస్ కిచెన్’ అనే కొత్త బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. అది కూడా తన అత్త కిచెన్ రెసిపీలను ఆధారంగా చేసుకొని ఈ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఇప్పటికే తన అత్త సురేఖతో తన అనుబంధం ఎలా ఉంటుందో పలుమార్లు బయటపెట్టారు ఉపాసన. ‘అత్తమ్మస్ కిచెన్’ అనే వెంచర్‌ను లాంచ్ చేసి మరోసారి అత్తపై ప్రేమను చాటుకున్నారు. సురేఖ కొణిదెల వంటకాలంటే మెగా ఫ్యామిలీని అందరికీ ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. చిరంజీవి ఫారిన్ ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు కూడా సురేఖ చేసిన ఆహారాన్ని వెంట తీసుకొని వెళ్తానని కూడా పలుమార్లు బయటపెట్టారు. ఇప్పుడు అవే వంటకాలు ‘అత్తమ్మస్ కిచెన్’ అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
సోషల్ మీడియాలో ప్రమోషన్స్..
ఉమెన్స్ డే సందర్భంగా ‘అత్తమ్మస్ కిచెన్’ను ప్రమోట్ చేయడానికి రామ్ చరణ్ కూడా జాయిన్ అవ్వడం విశేషం. పులిహోర, రసం, ఉప్మాలాంటివి ఇన్‌స్టంట్‌గా చేసుకోవడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్, ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. సురేఖ కోసం ఉపాసన ప్రారంభించిన ఈ బిజినెస్‌ను చూసి ప్రేక్షకులంతా ప్రశంసిస్తున్నారు. ‘అత్తమ్మస్ కిచెన్’ లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీని ప్రమోషన్స్‌ను ప్రారంభించారు ఉపాసన. ఉమెన్స్ డే సందర్బంగా తన అత్తకు స్పెషల్‌గా విషెస్ కూడా తెలిపారు. దీంతో ఈ అత్త, కోడలు అనుబంధం చూసి ప్రేక్షకులు మరోసారి మురిసిపోతున్నారు.
Also Read: ఆ యాప్‌లో ‘గామి’కి నెగటివ్ పబ్లిసిటీ - బోట్ అకౌంట్స్‌తో దారుణమైన రేటింగ్స్