Allu Arjun : 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ డుమ్మా... కారణం ఏంటో తెలుసా?
Allu Arjun : 'తండేల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కావాల్సిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాస్ట్ మినిట్ లో ఈవెంట్ కు హ్యాండ్ ఇచ్చారు. దాని వెనుక గల కారణం ఏంటంటే?

Allu Arjun not attend to pre release event of Thandel : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రాధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా మూవీ 'తండేల్'. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 7న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తండేల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ముందుగా ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది 'తండేల్' టీం. కానీ లాస్ట్ మినిట్ లో అల్లు అర్జున్ ఈవెంట్ కి హాజరు కాకపోవడం చర్చకు దారి తీసింది. ఆయన 'తండేల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎందుకు డుమ్మా కొట్టారు అనే విషయాన్ని ఇదే కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ డుమ్మా
'తండేల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ హాజరు కాకపోవడం వెనక సంధ్య థియేటర్ ఘటన ఉందని ప్రచారం జరిగింది. 'పుష్ప 2' మూవీ ప్రీమియర్ల సందర్భంగా జరిగిన సంఘటన అల్లు అర్జున్ ని ఇబ్బందుల్లో పడేసిన సంగతి తెలిసిందే. ఈ సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ 'తండేల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాకుండా ఉండడమే మంచిదని నిర్ణయం తీసుకున్నట్టు టాక్ నడిచింది. కానీ నిజానికి ఆయన ఈవెంట్ కు హాజరుకాకపోవడం వెనుక అసలు కారణం వేరే ఉంది. ఆ రీజన్ ఏంటనే విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ "అల్లు అర్జున్ తీవ్రమైన గ్యాస్ సంబంధిత సమస్య కారణంగా బాధపడుతున్నారు. అందుకే ఈ ఈవెంట్ కి హాజరు కాలేదు" అంటూ బన్నీ ఈవెంట్ కి ఎందుకు హాజరు కాలేదనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
స్టెప్పులు వేసిన అల్లు అరవింద్
నిజానికి అల్లు అర్జున్ గనక ఈ మూవీకి స్పెషల్ గెస్ట్ గా హాజరై ఉంటే, మరింత బూస్టప్ దొరికినట్టుగా అయ్యేది. ఇప్పటికే 'తండేల్' మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న 'తండేల్'కు పుష్పరాజ్ గెస్ట్ అయితే, మరింత హైప్ పెరిగే ఛాన్స్ ఉండేది. బన్నీ ఈ ఈవెంట్ కి హాజరు కాలేదు అన్న డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పటికీ, ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు అల్లు అరవింద్ తన ఎనర్జీతో. 'తండేల్' వేదికపై అల్లు అరవింద్ యాంకర్ సుమతో కలిసి స్టెప్పులేసి, ఈవెంట్లో మరింత జోష్ పెంచే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆయన మాటల్లో హిట్ కొడతామన్న కాన్ఫిడెన్స్, నమ్మకం స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. నిర్మాత అల్లు అరవింద్ తో పాటు హీరో హీరోయిన్లు, డైరెక్టర్ అందరూ ఈ మూవీ విషయంలో గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ప్రేక్షకుల నుంచి ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 7 వరకు వెయిట్ అండ్ సీ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

