అన్వేషించండి

Bandla Ganesh Vs Trivikram : భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి - బండ్ల గణేష్

Bandla Ganesh Targest Trivikram Again : ట్విట్టర్ వేదికగా త్రివిక్రమ్ మీద శుక్రవారం బండ్ల గణేష్ పలు విమర్శలు చేశారు. ఆ దాడి నేడు కూడా కొనసాగుతోంది. మళ్ళీ ఆయన కొత్తగా ట్వీట్స్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానులలో తాను ఒకడినని పలు సినిమా వేదికలపై సగర్వంగా ప్రకటించుకున్న నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh). తనకు పవన్ దేవుడితో సమానమని సైతం పేర్కొన్నారు.  తన పిల్లలు దేవుడు ఎలా ఉంటాడు? నిజాయతీ అంటే ఏమిటి? అని అడిగితే పవన్ కళ్యాణ్ ఫోటోలు చూపించానని చెప్పుకొచ్చారు. అటువంటి బండ్ల గణేష్, ఇప్పుడు ట్విట్టర్ వేదికగా పవన్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)పై విమర్శలు చేస్తున్నారు. 

పవన్, బండ్ల మధ్య దూరం పెంచిన త్రివిక్రమ్!?
Bandla Ganesh Controversial Tweets : బండ్ల గణేష్ శనివారం ఉదయం చేసిన ట్వీట్ చూస్తే... తాను దేవుడిగా కొలిచే పవన్ కళ్యాణ్‌కు, తనకు మధ్య దూరం పెరగడానికి కారణం త్రివిక్రమ్ అని పరోక్షంగా చెప్పాలని ట్రై చేస్తున్నట్లు అర్థం అవుతోంది. 

''భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి
భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి  ''
అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. దానికి ముందు మరో ట్వీట్ చేశారు. 

సాగినంత కాలం నా అంత వాడు లేడందురు
సాగకపోతే ఊరక చతికిల పడిపోవదురు
చెప్పడమే నా ధర్మం... వినకపోతే నీ ఖర్మం…
గురూజీ   '' అని!

త్రివిక్రమ్, బండ్ల గణేష్ మధ్య అంతగా సత్సంబంధాలు లేవని 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ వేడుకకు కొన్ని రోజుల ముందు ప్రేక్షకులకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఫోన్ చేయగా... తనను త్రివిక్రమ్ రానివ్వడం లేదని బండ్ల గణేష్ చెప్పారు. ఆ ఆడియో సోషల్ మీడియాలో లీక్ కావడం, వైరల్ కావడం తెలిసిన విషయాలే. ఆ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్, తనకు మధ్య ఇప్పుడు మనస్పర్థలు ఏమీ లేవని, డైరెక్టర్ గారిని కలిశానని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడీ లేటెస్ట్ ట్వీట్స్ చూస్తే... ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతోందని అర్థం అవుతోంది.

Also Read : ఎన్టీఆర్ గాంధీగా మారిన వేళ - నెహ్రూ ఆశ్చర్యపోయిన సభ, స్వర్ణ పతకంతో సత్కారం!

త్రివిక్రమ్ మీద శుక్రవారం ఉదయం నుంచి కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేస్తూ బండ్ల గణేష్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. నెటిజనులకు గుడ్ మార్నింగ్ చెబుతూ ఆయన ఓ కొటేషన్ షేర్ చేశారు. దానికి ఒకరు రిప్లై ఇస్తూ 'బండ్లన్న నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని వుంది' అన్నాడు. 'గురూజీని కలవండి... ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వండి. అప్పుడు అది నెరవేరుతుంది' అని బండ్ల గణేష్ సమాధానం ఇచ్చారు. 

తెలుగు చిత్రసీమలో గురూజీ అంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే పేరు త్రివిక్రమ్ ఒక్కరే. ఆయన్ను బండ్ల గణేష్ టార్గెట్ చేశారని జనాలకు చాలా ఈజీగా అర్థమైంది. బండ్ల గణేష్ రిప్లై సెన్సేషన్ కావడంతో ప్రొడ్యూసర్ కావాలని ఉందంటూ ట్వీట్ చేసిన నెటిజన్, తన ట్వీట్ డిలీట్ చేశారు. అయినా సరే బండ్ల గణేష్ ఆగలేదు. 

''భార్యా భర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురు శిష్యుల్ని... ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే! అది మన గురూజీ స్పెషాలిటీ'' అని మరో ట్వీట్ చేశారు. ఉన్నట్టుండి త్రివిక్రమ్ మీద పరోక్షంగా బండ్ల గణేష్ ట్వీట్ చేయడానికి కారణం ఏమిటి? ఎందుకు టార్గెట్ చేశారు? అనేది చాలా మందికి అంతుచిక్కని ప్రశ్నలా మారింది. 

Also Read : ముఖ్యమంత్రైన తర్వాత కూడా ఎన్టీఆర్ రోడ్డుపై స్నానం చేసేవారు, గంజి అడిగి తాగేవారు: జయప్రద

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget