Prabhas: మరోసారి ప్రభాస్‌కు జోడీగా త్రిష - 18 ఏళ్ల తర్వాత ఈ హిట్ పెయిర్ సెట్?
Prabhas - Trisha: మరోసారి వెండితెరపై ప్రభాస్, త్రిష జోడీ అలరించేందుకు రెడీ అవుతుందట. డార్లింగ్ భారీ ప్రాజెక్ట్‌లో త్రిషను హీరోయిన్గా తీసుకోబోతున్నట్టు ఓ అప్డేట్ నెట్టింట చక్కుర్లు కొడుతుంది.
Trisha Likely to Join With Prabhas: టాలీవుడ్లో ప్రభాస్-త్రిష జోడికి మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరిది హిట్ పెయిర్ కూడా. వీరిద్దరు తొలిసారి నటించిన వర్షం మూవీ ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత బుజ్జిగాడు, పౌర్ణమి సినిమాల్లోనూ కలిసి నటించారు. ఇప్పుడు ఇదే కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందట. మరోసారి ప్రభాస్-త్రిషలు వెండితెరపై జంటగా అలరించేందుకు రెడీ అవుతున్నారట. ఇందుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.
అలాగే 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ అప్పటికే 'డార్లింగ్' ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి రాలేదు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడీ రిలీజ్‌తో ఫ్రీ అయ్యాడు. ఇక నెక్ట్స్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీకి సిద్దం అవుతున్నాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలో స్పిరిట్ టీం హీరోయిన్ వేటలో పడ్డారట. ఈ క్రమంలో సందీప్ రెడ్డి త్రిషను సంప్రదించారట. పొన్నియిన్ సెల్వన్ తర్వాత త్రిష ఇండస్ట్రీలో మళ్లీ ఫుల్ యాక్టివ్ అయ్యింది. ఈ సినిమాతో నేషనల్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ పెరిగింది.
40 ఏళ్ల వయసులోనూ నేటి హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ తన గ్లామర్‌తో మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం త్రిష సౌత్‌లో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అంతేకాదు ప్రభాస్-త్రిష హిట్ పెయిర్ కాబట్టి మళ్లీ ఈ జోడి వెండితెరపైకి తీసుకువస్తే మరింత ఆదరణ వస్తుందనే ఉద్దేశంతో స్పిరిట్‌లో త్రిషను హీరోయిన్గా పరిశీలిస్తుందట మూవీ టీం. మరో బజ్ ప్రకారం ఇప్పటికే సందీప్ త్రిషను ఈ విషయమై కలిశారట. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేయిట్ చేయాల్సిందే. ఇదే నిజం అయితే మాత్రం మళ్లీ ఈ జంట 18 ఏళ్లకు వెండితెరపై చూడబోతున్నట్టే. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్‌గా నిలిచిన 'పౌర్ణమి' సినిమా వచ్చి 18 ఏళ్లు అవుతుంది. మళ్లీ వీరిద్దరు జంట వెండితెరపై కనిపించలేదు.
యానిమల్తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ తర్వాత ఆయన దర్శకత్వలో వస్తున్న చిత్రం స్పిరిట్ కావడంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని గతంలో ఓ ఇంటర్య్వూలో సందీప్ రెడ్డి పేర్కొన్నాడు. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకువస్తామని తెలిపాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్న 'రాజా సాబ్' సినిమాతో బిజీగా ఉన్నాడు.మరోవైపు ప్రస్తుతం త్రిష చిరంజీవి సరసన 'విశ్వంభర'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.