అన్వేషించండి

'భగవంత్ కేసరి' ట్రైలర్ వచ్చేస్తోంది - ఈసారి అంతకుమించి ఉంటుందట!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 'భగవంత్ కేసరి' ట్రైలర్ రిలీజ్ డేట్ ని మేకర్స్ తాజాగా ప్రకటించారు.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలయ్య 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) మూవీ నుంచి మరో అదిరిపోయే బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదీని ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. 'ఐ డోంట్ కేర్'(I Dont Care) అనేది ఈ సినిమా టాగ్ లైన్. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా విడుదలైన 'ఉయ్యాల ఉయ్యాల' సాంగ్ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఇప్పుడు సినిమా నుంచి మరో బ్లాస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. 'భగవంత్ కేసరి' ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓసారి కొత్త పోస్ట్ ని కూడా విడుదల చేశారు. పోస్టర్లో బాలయ్య కుర్చీలో గంభీరంగా కూర్చుని చేతిలో రాడ్ పట్టుకుని ఊర మాస్ లుక్ లో కనిపించారు.

ఆయన వెనుక కొందరు అధికారులు వెపన్స్ చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నారు. జైలు ఆవరణలో ఉన్నట్టు ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇక చిత్ర ట్రైలర్ ను అక్టోబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ‘‘గతంలో ఎన్నడూ చూడని విధంగా మీ ఊహకందని రేంజ్ లో ఉంటుంది’’ అని ఈ సందర్భంగా మేకర్స్ పేర్కొన్నారు. అంతేకాకుండా సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. ఈ అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా అందుకొని అనిల్ రావిపూడి మొదటిసారి బాలయ్యతో సినిమా చేస్తుండడంతో కచ్చితంగా ఈ మూవీతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ బలంగా ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ తో పాటు ప్రచార చిత్రాలకు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా టీజర్ లో బాలయ్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్, యాక్షన్ అయితే అదిరిపోయింది. సినిమాలో మొట్టమొదటిసారి బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు.

ఆ డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఇప్పటికే శాంపిల్ గా కొన్ని చూపించారు. అంతేకాదు అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం బాలయ్య మేకవర్ ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్న ఈ చిత్రంలో తమిళ విలక్షణ నటుడు శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : ఆ సాంగ్‌కు థియేటర్లు తగలబడిపోతాయి - 'గుంటూరు కారం' నుంచి సిద్ధు మాసివ్ అప్డేట్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Irumudi Yaalalo Yaalalo Song : ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Embed widget