అన్వేషించండి

ఆ సాంగ్‌కు థియేటర్లు తగలబడిపోతాయి - 'గుంటూరు కారం' నుంచి సిద్ధు మాసివ్ అప్డేట్!

మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ 'మ్యాడ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే అప్డేట్ రివీల్ చేశాడు.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ తాజాగా మహేష్ బాబు 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ని అందించాడు. 'మ్యాడ్' మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన సిద్దు ఈ ఈవెంట్లో 'గుంటూరు కారం' అప్డేట్‌ను అందరితో పంచుకోవడంతో ఈ అప్డేట్‌తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి అనే వివరాల్లోకెళ్తే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'గుంటూరు కారం'. 'అతడు', 'ఖలేజా' వంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో సినిమా రాబోతుండడంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దానికి తోడు రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను తారస్థాయికి చేర్చింది. ఈసారి త్రివిక్రమ్ మహేష్ ని ఊర మాస్ అవతారంలో చూపించబోతున్నట్లు టీజర్ లో స్పష్టం అవడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా ఎన్నెన్నో మార్పులతో ఇంకా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుండటంతో సంక్రాంతికి ఈ సినిమా రావడం కష్టమేనని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు డేట్లు కూడా ఫిక్స్ చేశారు.

కానీ ఎట్టి పరిస్థితుల్లో 'గుంటూరు కారం' సంక్రాంతికి రిలీజ్ అవుతుందని నిర్మాత నాగ వంశీ తాజాగా కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా సినిమా రిలీజ్‌కు 100 రోజులు ఉందని అఫీషియల్ పోస్టర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. 'గుంటూరు కారం' సినిమా ఎవరు ఊహించని విధంగా ఉంటుందని, సినిమా కలెక్షన్స్ రాజమౌళి సినిమాల కలెక్షన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయని నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ మూవీపై భారీ హైప్ నెలకొంది. చాలా రోజుల నుంచి మూవీ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి దసరా కానుకగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు నాగ వంశీ తెలిపాడు.

ఇక తాజాగా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ 'గుంటూరు కారం' సాంగ్ గురించి ఒక క్రేజీ అప్డేట్ రివీల్ చేశాడు. 'మ్యాడ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన సిద్దు వేదికపై మాట్లాడుతూ.." నిర్మాత చినబాబు గారితో ఇప్పుడే మాట్లాడానని, ఆయన గుంటూరు కారం సాంగ్ షూటింగ్ నుంచి ఈవెంట్ కి వస్తున్నట్లు తెలిపాడు. చిన్న బాబు గారి కళ్ళల్లో అంత ఆనందం, ఆ మాటల్లో ఎక్సైట్మెంట్ తను చాలా రోజుల తర్వాత చూస్తున్నానని, ఆయన ఎక్సైట్మెంట్ ని చూస్తుంటే గుంటూరు కారం సాంగ్ రేపు రిలీజ్ తర్వాత థియేటర్స్ తగలబడిపోతాయి" అని చెప్పుకొచ్చాడు. ఈ అప్డేట్ కాస్త మహేష్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Also Read : ఓవైపు ఫన్, మరోవైపు ఎమోషన్- ఆకట్టుకుంటున్న ‘ప్రేమ విమానం’ ట్రైలర్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Madhuram Song Lyrics: కార్తీక్ మెలోడీ పాడితే మధురమే... మెగా కోడలు లావణ్య 'సతీ లీలావతి'లో లవ్ సాంగ్ లిరిక్స్ - వనమాలి ఏం రాశారంటే?
కార్తీక్ మెలోడీ పాడితే మధురమే... మెగా కోడలు లావణ్య 'సతీ లీలావతి'లో లవ్ సాంగ్ లిరిక్స్ - వనమాలి ఏం రాశారంటే?
Vijay Deverakonda Car Collection: విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?
విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
Embed widget