‘బ్రో’తో మరో ఐటెమ్ సాంగ్, పచ్చి బూతులతో ‘సైతాన్’ టైలర్ - మరిన్ని సినీ విశేషాలను ఇక్కడ చూసేయండి
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!
వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తాజాగా ఆయన ‘బ్రో’ మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘OG’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా ‘బ్రో’ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రంలో పవర్ స్టార్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీరోల్ ప్లే చేస్తున్నారు. సూపర్ హిట్ తమిళ సినిమా ‘వినోదయ సీతమ్’ను తెలుగులోకి ‘బ్రో’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా జూలై 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత
బాలీవుడ్ లో మరో విషాద ఘటన జరిగింది. హిందీ, మరాఠీ సినిమాల్లో అద్భుత నటిగా గుర్తింపు తెచ్చుకుని, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సులోచన లట్కర్ అనారోగ్యంతో కన్నుమూశారు. 94 ఏండ్ల వయసున్న సులోచన, వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో ముంబైలోని సుశృశా హాస్పిట్లో కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఆమెకు శ్వాసకోశ సమస్యలతో పాటు ఇతర వయస్సు సంబంధిత వ్యాధులు ఉన్నాయి. జూన్ 3 నుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వెంటనే ఆమెను డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచారు. మూడు వారాల పాటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటుంది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం(జూన్ 4న) సాయంత్రం 6.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ 'ఆది పురుష్' రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇప్పుడు సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 6న సాయంత్రం 5గంటలకు ప్రారంభం కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్ డేట్ తెగ వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామీజీ గెస్ట్ గా రాబోతున్నారు. ఆయనతో పాటు చిన జీయర్ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పచ్చి బూతులు, పారుతున్న నెత్తురు, జుగుప్సాకరంగా ‘సైతాన్’ ట్రైలర్’ - పెద్దలకు మాత్రమే!
ఓటీటీ కోసం సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తున్న దర్శకుల జాబితాలో మహి వి. రాఘవ్ కూడా చేరారు. ఇప్పటికే ఆయన ‘సేవ్ ద టైగర్స్’వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు. ఈ సిరీస్ కు ఆయన క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇంట్లో భార్య భర్త మధ్య జరిగే గొడవల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై చక్కటి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన మరో వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
శకుని మామా ఇకలేరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్తమించిన గుఫీ పెయింటల్!
భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ కలిగి సీరియల్ ‘మహాభారత్’. బీఆర్ చోప్రా భారతీయ ఇతిహాసం ‘మహాభారతం’ ఆధారంగా దీనికి రూపకల్పన చేశారు. ఆయనతో పాటు ఆయన తనయుడు రవి చోప్రా దర్శకత్వం వహించారు. ఏండ్లు గడుస్తున్న ఈ సీరియల్ లోని పాత్రలను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఆ సీరియల్ లో కుళ్లుకుతంత్రాలో నిండి ఉన్న శకుని మామ క్యారెక్టర్ లో నటించి, మెప్పించిన ఇకలేరు. గత కొంతకాలంగా వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఇవాళ (జూన్ 5) ఉదయం 9 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)