అన్వేషించండి

'అనన్య' ట్రైలర్‌ అప్‌డేట్‌, 'యానిమల్‌' డైరెక్టర్‌పై తమిళ్‌ హీరో షాకింగ్‌ కామెంట్స్‌ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

Makeup Man Chandra About Nagarjuna: మేకప్ మ్యాన్ చంద్ర. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్ కింగ్ నాగార్జునకు పర్సనల్ మేకప్ మ్యాన్ గా దశాబ్దాల తరబడి పని చేశారు. అక్కినేని ఫ్యామిలీలో ఒకరిద్దరు మినహా మిగతా వారందరికీ మేకప్ వేశారు. ఆయన చేత మేకప్ చేయించుకున్న నటీనటులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారనే పేరుంది. అందుకే తమ తొలి సినిమాకు చంద్రతో మేకప్ వేయించుకునేవారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్ర, నాగార్జునతో, ఆయన కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. నాగార్జున ఫ్యామిలీ తనను మేకప్ మ్యాన్ గా కాకుండా కుటుంబ సభ్యుడిగా చూసుకునే వారని చెప్పుకొచ్చారు. ‘అన్నమయ్య’ సినిమాలో మినహా ఏ సినిమాలోనూ ఆయన విగ్ వాడలేదని వెల్లడించారు.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Kalki 2898 AD: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ 'కల్కీ 2898 ఏడీ' మూవీపై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ అయినా క్షణాల్లో వైరల్‌ అవుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి తరచూ ఎదోక అప్‌డేట్‌ హాట్‌టాపిక్‌ అవుతుంద. మొన్నటి వరకు రిలీజ్‌ డేట్‌ వాయిదా అంటూ ఓ రూమర్‌ చక్కర్లు కొట్టింది. మే 9న మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ టీం నుంచే ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. అయినా కల్కీ వాయిదా పడుతుందంటూ ప్రచారం చేశారు. ఈ వార్త ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ని డైలామాలో పడేసింది. దాంతో స్వయంగా మూవీ టీం స్పందించి విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఇక దీంతో ఈ మహా శివరాత్రికి మూవీ టీం ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇస్తుందా? అని ఆడియన్స్‌, ఫ్యాన్స్ అంచనాలు వేసుకుంటున్నారు. ఈ శివరాత్రికి 'కల్కీ 2898 ఏడీ' నుంచి ఏదైనా స్పెషల్‌ వీడియో వచ్చే చాన్స్‌ ఉందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Ananya Trailer: అనన్య పేరుతో తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతానికి ఇద్దరు కథానాయికలు ఉన్నారు. 'మల్లేశం', 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య నాగళ్ళ ఒకరు అయితే... '30 వెడ్స్ 21' ఫేమ్ అనన్య శర్మ మరొకరు. ఇప్పుడీ 'అనన్య' ప్రస్తావన ఎందుకంటే? ఆ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. 'అనన్య' సినిమాలో జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ప్రధాన తారాగణం. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇదొక హారర్ సినిమా. అయితే... ఫ్యామిలీ ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకునే అంశాలు ఉంటాయని దర్శక నిర్మాతలు చెప్పారు. 'అనన్య' సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, ఈ నెల 22న థియేటర్లలో సినిమా విడుదల కానుందని జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో 'అనన్య' ట్రైలర్ (Ananya Movie Trailer) ఫ్యామిలీ స్టార్, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ చేత ఆవిష్కరింపజేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Fan Misbehaved With Kajal Aggarwal: పబ్లిక్‌లో అభిమానులతో తీరుతో హీరోహీరోయిన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే చూశాం. ముఖ్యంగా హీరోయిన్లకు ఫ్యాన్స్‌ అత్యూత్సాహం చేదు అనుభవాన్ని ఇస్తుంది. పలు ఈవెంట్స్‌, షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన హీరోయిన్లను చూసేందుకు, వారితో సెల్ఫీ తీసుకునేందుకు ఫ్యాన్స్‌ ఎగబడటం కామన్‌. కానీ అందులో కొందరు ఆకతాయిల విచిత్ర ప్రవర్తన హీరోయిన్లను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌కు సైతం ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాజల్‌తో ఓ అభిమాని అభ్యంతరకంగా వ్యవహరించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Kollywood Actor Sivakarthikeyan About Sandeep Reddy Vanga : 'యానిమల్' మూవీ తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఓ డిఫరెంట్ యాటిట్యూడ్ తో కూడిన హీరోయిజాన్ని తన సినిమాలలో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తీసింది 2 సినిమాలే అయినా వాటితో దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. సందీప్ రెడ్డి వంగ నుంచి గత ఏడాది చివర్లో వచ్చిన 'యానిమల్' సినిమాని ఎంతోమంది బాగుందని మెచ్చుకున్నారు. అంతకంటే ఎక్కువ మంది విమర్శించారు కూడా. ఈమధ్య కొంతమంది తమిళ సెలబ్రిటీలు అయితే 'యానిమల్' మూవీపై, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఓ కోలీవుడ్ స్టార్ హీరో మాత్రం సందీప్ రెడ్డి వంగా గురించి అందుకు భిన్నంగా మాట్లాడడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Madhavi Latha: రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
High Tension in Jammalamadugu: కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
Vijayawada Hyderabad Highway: ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం, విజయవాడ - హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్
Vijayawada Hyderabad Highway: ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం, విజయవాడ - హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్
Nara Lokesh Comments: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Jammalamadugu MLA Sudheer Babu Attacked | జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దాడి | ABP DesamYSRCP TDP Members Fight With Bombs | బాంబులు విసురుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు | ABP DesamMadhavi Latha vs Asaduddin Owaisi |Elections 2024| ఎదురుపడిన ఒవైసీ-మాధవి లత.. ఆ తరువాత ఏం జరిగింది.?Madhavi Latha | Old city Elections 2024 | పాతబస్తీలో హై టెన్షన్ వాతావరణంలో పోలింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Madhavi Latha: రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
రాక్షస రాజ్యానికి అంతం లేదా? తలుపులు మూసివేసి రిగ్గింగ్: మాధవీ లత ఆరోపణలు
High Tension in Jammalamadugu: కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
కడప జిల్లాలో కొనసాగుతున్న హైటెన్షన్- రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలకు గాయం
Vijayawada Hyderabad Highway: ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం, విజయవాడ - హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్
Vijayawada Hyderabad Highway: ఏపీ ఓటర్లు తిరుగు ప్రయాణం, విజయవాడ - హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్
Nara Lokesh Comments: ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
Telangana CEO Vikas Raj: నేడు తెలంగాణలో 38 కేసులు నమోదు, భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలు: వికాస్ రాజ్
నేడు తెలంగాణలో 38 కేసులు నమోదు, భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్‌కు ఈవీఎంలు: వికాస్ రాజ్
AP Election 2024 Polling Percentage: ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
ఏపీలో ముగిసిన పోలింగ్, ఉద్రిక్త ఘటనలు 120కి పైనే! ఓటింగ్ శాతం ఎంతంటే
Telangana Elections 2024 ends: తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
తెలంగాణలో ముగిసిన పోలింగ్, సాయంత్రం 5 వరకు 61 శాతం ఓటింగ్
CBSE 10th result 2024: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
CBSE 10th result 2024: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Embed widget