Tollywood Young Heroes: విజయ్ దేవరకొండ నుంచి సిద్ధు జొన్నలగడ్డ వరకూ.. రూ.100 కోట్లు కొట్టిన కుర్ర హీరోలు వీరే!
₹100 cr+ Young Heroes in Tollywood: రూ.100 కోట్ల కలెక్షన్లు ఇప్పుడు హీరోల మినిమం బెంచ్ మార్క్ గా మారిపోయింది. ఇప్పటి వరకూ వంద కోట్ల క్లబ్ లో చేసిన టాలీవుడ్ టైర్-2 యంగ్ హీరోలెవరంటే...
₹100 cr+ Young Heroes in Tollywood: బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్లు అనేది టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ మినిమం బెంచ్ మార్క్ గా మారిపోయింది. ఇప్పటికే దాదాపు మన అగ్ర హీరోలంతా సెంచరీలు కొట్టి, డబుల్ సెంచరీల మీద దృష్టి సారిస్తున్నారు. మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న టైర్-2 హీరోలు సైతం వంద కోట్లని టార్గెట్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్టుగా సిద్ధు జొన్నలగడ్డ 100 కోట్ల క్లబ్ లో చేరిన నేపథ్యంలో, ఆల్రెడీ ఆ మైలురాయిని అందుకున్న కుర్ర హీరోలెవరో ఇప్పుడు చూద్దాం.
విజయ్ దేవరకొండ:
'అర్జున్ రెడ్డి' సినిమాతో 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. 'గీత గోవిందం'(2018) చిత్రంతో 100 కోట్లు వసూలు చేసి, ఈ ఘనత సాధించిన ఫస్ట్ టాలీవుడ్ టైర్-2 హీరోగా నిలిచారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ₹ 132 కోట్ల గ్రాస్ అందుకుంది. అప్పటి నుంచి 200 కోట్లను టార్గెట్ గా పెట్టుకున్న విజయ్ కు నిరాశే ఎదురవుతోంది. ఇప్పుడు తాజాగా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ కూడా మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది. ఎప్పటికైనా రెండు వందల కోట్లు సాధించి తీరుతానని వీడీ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న 'VD 12' మూవీతో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారేమో చూడాలి.
వరుణ్ తేజ్:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'F 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమాతో 100 కోట్ల రుచి చూశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాంతికి వచ్చిన ఈ కామెడీ ఎంటర్టెనర్, బాక్సాఫీసు దగ్గర రూ. 130 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. అయితే ఇక్కడ ఈ క్రెడిట్ మెగా హీరో ఒక్కడికే ఇవ్వలేం. ఎందుకంటే వరుణ్ తో పాటుగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఏ సినిమా కూడా వంద కోట్లకు దగ్గరగా వెళ్ళలేదు. త్వరలోనే 'మట్కా' అనే పాన్ ఇండియా మూవీతో అలరించడానికి రెడీ అవుతున్నాడు.
పంజా వైష్ణవ్ తేజ్:
మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. 2021లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉప్పెన' సినిమాతో వైష్ణవ్ ఈ ఫీట్ సాధించాడు. అప్పటి నుంచి మరో బ్లాక్ బస్టర్ అందుకోడానికి మెగా హీరో కష్టపడుతూనే ఉన్నాడు. చివరగా వచ్చిన 'ఆది కేశవ' మూవీ డిజాస్టర్ గా మారింది.
నిఖిల్ సిద్ధార్థ్:
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన సినిమా 'కార్తికేయ 2'. ఇది 2022లో వచ్చిన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్. దీంతో నిఖిల్ వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ఈ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీనికి సీక్వెల్ గా 'కార్తికేయ 3' మూవీ తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.
నాని:
నేచురల్ స్టార్ నాని గతేడాది 'దసరా' సినిమాతో తొలిసారిగా బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టాడు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా.. 115 కోట్లకు పైగా వసూలు చేసింది. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం'సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే సుజీత్ తో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ అనౌన్స్ చేశాడు.
సాయి దుర్గ తేజ్:
రూ.100 కోట్లు కొట్టిన హీరోలలో సాయి దుర్గ తేజ్ కూడా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ 'విరూపాక్ష' మూవీతో ఈ ఫీట్ సాధించారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించున్నా ఈ మిస్టిక్ హారర్ థ్రిల్లర్.. ఫైనల్ రన్ ముగిసే నాటికి వంద కోట్లను క్రాస్ చేసింది. అలానే తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి తేజ్ నటించిన 'బ్రో' సినిమా కూడా రూ. 115 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది.
తేజ సజ్జ:
'హనుమాన్' మూవీతో యంగ్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సూపర్ హీరో సినిమా, ఈ ఏడాది సంక్రాంతికి రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
సిద్ధు జొన్నలగడ్డ:
'టిల్లు స్క్వేర్' సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లోకి లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. రెండేళ్ల క్రితం 'డీజే టిల్లు' సినిమా టైంలోనే ఈ మైలురాయిని అనుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సిద్ధూ.. చెప్పి మరీ వంద కోట్లు కొట్టాడు. మార్చి చివరి వారంలో రిలీజైన ఈ మూవీ.. 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.101.4 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Also Read: HBD Akhil: ఎలాంటి రిస్క్ తీసుకోడానికైనా సిద్ధపడే అఖిల్ - అక్కినేని వారసుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?