News
News
వీడియోలు ఆటలు
X

అప్పుడే పెళ్లేంటీ? 35 ఏళ్లు దాటినా పెళ్లి మాటెత్తని హీరోయిన్స్, 40 ప్లస్ వచ్చినా సింగిలే!

సినీ ఇండస్ట్రీలో మూడు పదుల వయసు దాటినా పెళ్లి ఆలోచన చేయని హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ.. 35 ఏళ్ళు పైబడినా వివాహం చేసుకోని ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:
ఏ వయసులో జరగాల్సిన అచ్చటా ముచ్చట ఆ వయసులోనే జరగాలంటారు పెద్దలు. అయితే కెరీర్ మీదనే దృష్టి పెడుతున్న నేటి తరం యువతీ యువకులు.. నిర్థిష్టమైన ఏజ్ వచ్చే వరకూ పెళ్ళి మీద ఫోకస్ పెట్టడం లేదు. దీనికి సినీ ఇండస్ట్రీ కూడా మినహాయింపు కాదు. పెళ్లీడు వచ్చినా వివాహం గురించి ఆలోచించని హీరో హీరోయిన్స్ ఇప్పుడు చాలా మందే వున్నారు. 
 
సాధారణ అమ్మాయిలకు పాతికేళ్లు వస్తే, పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది. కానీ వెండితెర మీద అలరించే హీరోయిన్స్ కు మాత్రం ముప్పై ఏళ్ల తర్వాత కూడా పెళ్లికి ఛాన్స్ ఉంటుంది. కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని గడిచిన రెండేళ్లలో పలువురు ముద్దుగుమ్మలు పెళ్ళి పీటలు ఎక్కేశారు. మరికొందరు మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. 30 ఏళ్లు దాటినా ఇంకా పెళ్ళి చేసుకుని హీరోయిన్లు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం!

అనుష్క:

నాలుగు పదులు దాటినా పెళ్ళి గురించి ఆలోచించని హీరోయిన్లలో అనుష్క శెట్టి ముందు వరుసలో ఉంటుంది. 'సూపర్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ.. దాదాపు 15 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుత వయస్సు 41 ఏళ్ళు. ఇప్పటికీ సింగిల్ గా ఉంటోంది. గతంలో ఓ హీరోతో డేటింగ్ చేసిందని.. ఓ క్రికెటర్ ని పెళ్లి చేసుకోబోతోందని.. ఓ డైరెక్టర్ తో ఎంగేజ్మెంట్ జగిందని.. ఇలా అనుష్క పర్సనల్ లైఫ్ పై రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా తర్వాతైనా తన వివాహానికి సంబంధించిన శుభవార్త చెబుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎురుచూస్తున్నారు.
 

త్రిష కృష్ణన్: 

గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష.. ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. అయితే 39 ఏళ్లు వచ్చినా అమ్మడు ఇంకా పెళ్ళి చేసుకోలేదు. వాస్తవానికి వరుణ్ అనే బిజినెస్ మ్యాన్ తో త్రిష కొంతకాలం పాటు డేటింగ్ చేసింది. అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ మరికొన్ని రోజుల్లో మ్యారేజ్ చేసుకుంటారని అనుకుంటుండగా.. ఏం జరిగిందో ఏమో సడన్ గా పెళ్లి క్యాన్సిల్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా, సమాధానం దాటవేస్తూ వస్తోంది త్రిష. సక్సెస్ ఫుల్ సినీ కెరీర్ ను లీడ్ చేస్తున్న త్రిష.. పర్సనల్ లైఫ్ లోనూ హ్యాపీగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

శృతి హాసన్:

సీనియర్ హీరో కమల్ హాసన్ గారాల కూతురు శృతి హాసన్ వయస్సు కూడా 37 ఏళ్ళు దాటిపోయింది. అయినా సరే ఇంకా మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్ట లేదు. దశాబ్దానికి పైగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ బ్యూటీ.. మైకేల్ కార్ సేల్ అనే బ్రిటిషర్ తో డేటింగ్ చేస్తోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే శృతి కొన్నాళ్ళకు అతనితో బ్రేకప్ చెప్పి, శాంతను హజారికా అనే వ్యక్తితో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ కనిపిస్తోంది. కాకపొతే లక్ బ్యూటీ ఈ రిలేషన్ షిప్ ని అయినా నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తుందేమో చూడాలి.

తాప్సీ పన్ను:

'ఝుమ్మంది నాదం' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ గా రాణిస్తోంది. అయితే 35 ఏళ్లు దాటినా ఇంతవరకూ అమ్మడు పెళ్ళి చేసుకోలేదు. కాకపొతే తాప్సీ కొన్నేళ్లుగా బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో ప్రేమలో ఉంది. ఇప్పటికే తన బాయ్ ఫ్రెండ్ గురించి అందరికీ పరిచయం చేసింది.
 

కంగనా రనౌత్: 

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ వుమెన్ సెంట్రిక్ చిత్రాలతో దూసుకుపోతోంది. క్వీన్ ప్రస్తుత వయస్సు 36 ఏళ్లు. గతంలో తన కో స్టార్ అధ్యాయన్ సుమన్ తో ఈ బ్యూటీ డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత హ్యండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ తో ప్రేమాయణం సాగించింది. అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయములో ఇప్పటికీ కంగనా వీలు చిక్కినప్పుడల్లా హృతిక్ ను విమర్శిస్తూ ఉంటుంది.
 

ఇలియానా:

దేవదాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న గోవా బ్యూటీ ఇలియానా.. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో హవా కొనసాగించింది. ప్రస్తుతం హిందీ చిత్రాలకే పరిమితమైన ఇల్లీ బేబీ ప్రెజెంట్ ఏజ్ 36. గతంలో ఈ భామ సెబాస్టియన్ మైఖేల్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో వుంది. కానీ కొన్నాళ్లకు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.

శ్రద్దా కపూర్:

సాహో భామ శ్రద్ధా కపూర్ ప్రస్తుత వయస్సు 36 ఏళ్లు. ఇటీవల కాలంలో బీ టౌన్ భామలు అందరూ ఒక్కరొక్కరుగా వివాహ బంధంలో అడుగుపెడుతున్న నేపధ్యంలో అమ్మడి పెళ్లెప్పుడు అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. రోహన్ శ్రేష్ఠ అనే వ్యక్తితో శ్రద్దా డేటింగ్ లో ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

సోనాక్షి సిన్హా:

‘దబాంగ్’ నటి సోనాక్షి సిన్హా ఏజ్ కూడా 35 దాటింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బబ్లీ బ్యూటీ.. జహీర్ ఇక్బాల్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు బీ టౌన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మరి త్వరలోనే అమ్మడు పెళ్ళి న్యూస్ చెప్తుందేమో చూడాలి.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్:

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ వయసు ఇప్పుడు 37 ఏళ్ళు. అందాల భామ ఇంకా పెళ్లి వైపు ఆలోచన చేయలేదు. కాకపొతే ఈమె గతంలో కాన్ మ్యాన్ సుఖేష్ చంద్రశేఖరన్ తో డేటింగ్ చేసినట్లు ఆ మధ్య రిలీజైన ఫోటోలను బట్టి అర్థమవుతోంది. అంతకముందు బహ్రెయిన్ యువరాజు షేక్ హుస్సేన్ బిన్ రషీద్ అల్ ఖలీఫాతో కలసి తిరిగినట్లుగా వార్తలు వచ్చాయి.
 
ఇకపోతే టబు (52), సుస్మితా సేన్ (47), అమీషా పటేల్ (47) వంటి ఏజ్ బార్ నటీమణులు కూడా ఇంకా వివాహ బంధంలో అడుగుపెట్టలేదు. 35 ఏళ్లకు దగ్గర్లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ప్రస్తుతం ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో చక్కర్లు కొడుతోంది. తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ (32).. త్వరలోనే పెళ్లి చేసుకోనుందని టాక్. తమన్నా భాటియా (33), ప్రగ్యా జైస్వాల్ (33), కృతి సనన్ (32), పూజా హెగ్డే (32) వంటి పలువురు హీరోయిన్లు ముప్పై క్రాస్ చేసి పెళ్ళి చేసుకోని హీరోయిన్ల జాబితాలో ఉన్నారు.
Published at : 12 Apr 2023 11:09 AM (IST) Tags: Sonakshi Sinha Kangana Ranaut Shraddha Kapoor Jacqueline Fernandez Anushka Shruthi Hasan Tapsee Pannu

సంబంధిత కథనాలు

Urfi Javed: బాబోయ్ ఉర్ఫీ! టీ బ్యాగ్స్ తో డ్రెస్సా? నీ ఫ్యాషన్ సెన్స్‌కు దండం అంటున్న నెటిజన్స్!

Urfi Javed: బాబోయ్ ఉర్ఫీ! టీ బ్యాగ్స్ తో డ్రెస్సా? నీ ఫ్యాషన్ సెన్స్‌కు దండం అంటున్న నెటిజన్స్!

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

టాప్ స్టోరీస్

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్‌షా

Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్‌షా