Tollywood Film Federation: టాలీవుడ్ ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం - అలా చేయకుంటే షూటింగ్స్ బంద్
Tollywood Shootings: తమకు వేతనాలు పెంచాలని టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. అలా కాకుంటే సోమవారం నుంచి షూటింగ్స్ బంద్ చేయనున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Toollywood Film Federation Stop Shootings For Increasing Wages: టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు వేతనాలు పెంచే వరకూ షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించింది. 30 శాతం పెంచి ఇచ్చిన వారికే సోమవారం నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటామని ఫెడరేషన్ నాయకులు తేల్చిచెప్పారు. పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాకుంటే పూర్తిగా షూటింగ్స్‌లో పాల్గొనబోమని... బంద్ చేస్తామని హెచ్చరించారు.
మూవీ ప్రొడ్యూసర్స్ నుంచి వేతనాలు పెంచినట్లు సంబంధిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి... ఆ లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియజేసిన తర్వాత మాత్రమే షూటింగ్స్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. ఈ రూల్స్ తెలుగు సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా వర్తస్తుందని... ఇతర భాషా చిత్రాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అయితే, కార్మికుల వేతనాల విషయంపై కొద్ది రోజులుగా ఫిల్మ్ ఫెడరేషన్ - ఫిల్మ్ ఛాంబర్ మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఫెడరేషన్ నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి దీనిపై టాలీవుడ్ పెద్దలు, ప్రొడ్యూసర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.





















